‘నేనెక్కడ మారిపోతానో’ అని భయపడుతుంటా!

“మా ఫాదర్‌, కరణ్‌ జోహార్‌ ఎప్పుడు చెబుతుంటారు…’ఎన్ని విజయాలు వచ్చినా ఒదిగి ఉండమని’. దాన్ని ఎప్పుడూ ఫాలో అవుతాను’ అని అలియా భట్‌ తెలిపింది. తన కెరీర్‌ గురించి చెబుతూ…”నేనెక్కడ మారిపోతానో అని ఎప్పడూ భయపడుతుంటాను. అందుకే చాలా సార్లు నన్ను నేను చెక్‌ చేసుకుంటా. విజయం ప్రభావం నాపై ఉంటుందేమో అనుకుంటాను. నేనేమైనా మారిపోతున్నానా అనిపిస్తుంది. ఈ విషయంలో మా ఫాదర్‌, కరణ్‌ జోహార్‌ ఎప్పుడు చెబుతుంటారు… ‘ఎన్ని విజయాలు వచ్చినా ఒదిగి ఉండమని’. దాన్ని ఎప్పుడూ ఫాలో అవుతాను” అని తెలిపింది.
”ఆర్‌ ఆర్‌ ఆర్‌’ స్నేహం ప్రధానంగా సాగుతుంది. ఇందులో భాగం కావడం, ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని అలియా భట్‌ అన్నారు.బాలీవుడ్‌లో క్రేజీ కథానాయిక అలియా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చరణ్‌ సరసన అలియా కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అలియా తెలిపింది. స్నేహం ప్రధానంగా సాగే చిత్రమిదని చిత్ర పోస్టర్‌ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. అలియా ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్‌ 2’, ‘ఇన్‌షాల్లా’ ,‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రాల్లో నటిస్తూ అలియా బిజీగా ఉంది.
 
పట్టలేనంత ఆనందంతో పరుగెత్తాను
అలియాభట్‌ అద్భుతమైన నటి మాత్రమే కాదు, మంచి సింగర్‌ కూడా. తాను నటించిన ‘హైవే’, ‘హంప్టీ శర్మ కి దుల్హానియా’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘డియర్‌ జిందగీ’, ‘బద్రినాథ్‌ కి దుల్హనియా’ వంటి తదితర చిత్రాల్లో పాటలు పాడి శ్రోతల్ని అలరించారు. తాజాగా తొలిసారి ఆల్బమ్‌లో పాట పాడారు. ‘డోర్‌ బీన్‌’ అనే బ్యాండ్‌కి చెందిన ఓంకార్‌, గౌతమ్‌ కంపోజ్‌ చేసిన ‘ప్రాడా..’ అనే పాటలో తొలిసారిగా పాటపాడటంతోపాటు స్టెప్పులేసి అదరగొట్టారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఈ పాట కోసం ప్రాకీస్ట్‌ చేస్తున్న వీడియోని అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. అలియా సల్మాన్‌తో కలిసి ‘ఇన్‌షాల్లా’ చిత్రంలో నటించనుంది. ‘ఇన్‌షాల్లా’ కోసం దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఆఫర్‌ చేసినప్పుడు తన రియాక్షన్‌ గురించి అలియా చెబుతూ… ‘ఆ టైమ్‌లో నేను ఇండియాలో లేను. నాకు భన్సాలీ సర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఈ ఆఫర్‌ గురించి చెప్పారు. అంతే పట్టలేనంత ఆనందంతో పరుగెత్తాను. ఓ ఐదు నిమిషాలపాటు కంటిన్యూగా ఎగురుతూనే ఉన్నాను. అంతగా ఎగ్జైట్‌ అయ్యాను’ అని తెలిపింది