ప్రేమ,దయతో నింపేందుకు ప్రయత్నిస్తాను!

“రూమర్స్‌ నిజాన్ని చంపేస్తాయి. ఏ వ్యక్తికైనా అదొక సహజమైన మరణం లాంటిది. అక్కడ నిజానికి తావు ఉండదు”… అని అంటోంది అలియాభట్‌. “మన చుట్టూ నెగటివిటీ ఉంటే.. అది మనపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మనం కూడా అలానే ప్రవర్తిస్తాం. సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండాలి. నా వరకు నేను నెగటివిటీకి చాలా దూరంగా ఉంటాను’ అని అంటోంది. బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ యువ కథానాయిక అలియాభట్‌ ఇలా నెగటివిటీ, ప్రేమ, పాజిటివిటీపై స్పందించింది…. “నేనెప్పుడూ నెగటివిటీకి దూరంగా ఉంటాను. ఇండిస్టీలోని వ్యక్తులనైనా, మరెవరినైనా పాజిటివ్‌ కోణంలోనే చూస్తాను. ప్రారంభం నుంచి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరి నుంచి ఆత్మీయతను, ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని పొందుతూ వస్తున్నా. ఒకవేళ ఎక్కడైనా నెగటివిటీ కనిపిస్తే.. దయ,ప్రేమతో నింపేందుకు ప్రయత్నిస్తాను” అని అలియా చెప్పింది. సహనటులందరితోనూ అలియా స్నేహపూర్వకంగా ఉండటంతోపాటు తోటి నటీనటులతో కలిసి ఇటీవల ఓ ఛారిటీ కోసం దుస్తులను డొనేట్‌ చేసింది.
సర్‌ప్రైజింగ్‌గా… క్రియేటివ్‌గా ఉండాలి
‘స్క్రిప్ట్‌ ఎంపిక చేసుకునే విషయంలో నాకు చాలా లిమిటేషన్స్‌ ఉంటాయి. ఎన్నో బారియర్స్‌ ఉంటాయి’ అని అంటోంది అలియాభట్‌. విభిన్న కథా నేపథ్య చిత్రాలతో, విలక్షణ నటనతో అలియా క్రేజీ, భారీ ప్రాజెక్ట్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఎంపిక చేసుకునే స్క్రిప్ట్స్‌ గురించి అలియా చెబుతూ… ‘నాకు ఓ గొప్ప నటిని కావాలని లేదు. అయితే ఓ కథని ఎంపిక చేసుకునేటప్పుడు చాలా ఓపెన్‌ మైండ్‌తో వింటాను. నేను నటించే సినిమాలు ఆడియెన్స్‌కి సర్‌ప్రైజింగ్‌గా … క్రియేటివ్‌గా ఉండాలని కోరుకుంటాను. ఇలా చాలా లిమిటేషన్స్‌ ఉన్నా…అంతిమంగా నా లక్ష్యం ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడమే’ అని చెప్పింది .
 
హార్రర్ సినిమాలంటే చాలా భయం 
విభిన్న పాత్రలతో అలరిస్తున్న అలియాభట్ కు హార్రర్ సినిమాలంటే చాలా భయమట. అందుకే ఆ సినిమాల్లో నటించనని చెబుతోంది. బాలీవుడ్‌లో హార్రర్ సినిమాలకు పేరొందిన మహేష్‌భట్ కూతురు అలియాభట్..హార్రర్ సినిమాలంటే భయమని చెప్పడం ఆశ్చర్యకరం. తనకు గాడ్జిల్లా వంటి పెద్ద జంతువులన్నా భయమేనని అలియా చెబుతోంది. “ఒకసారి నా పుట్టినరోజు పార్టీకి గాడ్జిల్లా రావాలని అనుకున్నా.నా కోసం మా వాళ్లు గాడ్జిల్లా బొమ్మను ఏర్పాటుచేశారు. పెద్ద ఆకారాన్ని చూడగానే భయపడిపోయా. ఆ రోజు ఏడ్చుకుంటూ మా అమ్మ ఒడిలోనుంచి దిగనేలేదు. అప్పటి నుంచి నాకు గాడ్జిల్లా అన్నా.. పెద్ద జంతువులన్నా..హార్రర్ సినిమాలన్నా చాలా భయం” అని తన చిన్ననాటి విషయాలు చెప్పుకొచ్చింది అలియాభట్. “ నా సినిమాలు పిల్లలు కూడా చూస్తారు. వాళ్లు నన్ను చూసి ఇష్టపడాలే కానీ భయపడకూడదు. అందుకే హార్రర్ సినిమాల్లో నటించాలనుకోవడం లేదు”అని చెప్పింది అలియా
 
అలియా ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ.. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో నటిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రూపొందుతున్న చిత్రమిది. దీంతోపాటు హిందీలో ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్‌ 2’, ‘తఖ్త్‌’ చిత్రాల్లోనూ భిన్న పాత్రలను పోషిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయి’ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె అతిథులుగా కనిపిస్తారట