నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నా!

‘హైవే’, ‘2స్టేట్స్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘డియర్‌ జిందగీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది అలియా భట్‌. అలియా నటించిన చిత్రాలన్నీ దాదాపు విజయాలే సాధించడం విశేషం.ఈ నేపథ్యంలో ‘సక్సెస్‌లు నన్ను మార్చలేవు. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలానే ఉన్నాను’ అని అంటోంది అలియా భట్‌.

సక్సెస్‌ల గురించి అలియా మాట్లాడుతూ….’సక్సెస్‌ వచ్చినంత మాత్రాన నా ప్రవర్తనలో మార్పు ఉండదు. నేనెప్పుడూ ఒకేలా ఉంటాను. నేను ఎక్కడ పనిచేసినా, ఏ పనిచేసినా చిన్నప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నా. సినిమా ఇండిస్టీలో ఉన్నంత మాత్రాన నేనేదో సాధించానని అనుకోవడం లేదు. నేను సినిమాల కోసమే పనిచేస్తున్నాను. నాపై లేదా నా కెరీర్‌పైగాని మూడో వ్యక్తి ప్రమేయం, ఒత్తిడి లేదు.. ఉండదు కూడా. నాకు నచ్చినట్టుగానే చేసుకుంటూ వెళ్తున్నా’ అని తెలిపిింది. ప్రస్తుతం ‘రాజీ’, ‘గల్లీబాయ్స్ చిత్రాల్లో అలియా నటిస్తోంది.