మా సొంత ప్రపంచాన్ని కోల్పోయాం !

అలియా భట్‌ ప్రస్తుతం ‘రాజీ’ చిత్రంలో చేస్తోంది. ఇందులో కాశ్మీరీ అమ్మాయి పాత్రలో మెప్పించబోతుంది. నాలుగైదు నెలలుగా కాశ్మీర్‌లోని వివిధ అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రంలో ఈమె పాకిస్తాన్‌కు చెందిన ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంటుంది. ఆర్మీ ఆఫీసర్‌ పాత్రను విక్కీ కౌశల్‌ పోషించాడు. హరీందర్‌ సిక్కా రచించిన నవల ‘ కాలింగ్‌ సెహ్మాట్‌’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిందని అలియా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ షూటింగ్‌ స్పాట్‌లో దిగిన పలు అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ”  ‘రాజీ’ చిత్రీకరణ పూర్తయిపోయింది. షూటింగ్‌ చివరి రోజులన్నీ చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకంటే నేను పూర్తిగా ఆ పాత్రలోనే(రాజీ సినిమాలో క్యారెక్టర్‌) ఉండిపోయాను. అది కూడా ఏదో ఒక నెల రోజులు కాదు కొన్ని నెలలు పాటు ఆ పాత్రలో ఉండిపోయాను. నేను, చిత్ర దర్శకుడు మేఘనా గుల్జార్‌ మా సొంత ప్రపంచాన్ని మొత్తంగా కోల్పోయాం” అని పేర్కొంది అలియా.

ఈ మధ్యన హార్ట్ బ్రేకప్ లేదు !

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భట్ ఎంతో స్పీడ్‌గా ఉంటుంది. యంగ్ ఏజ్‌లోనే ఈ బ్యూటీ చూపిస్తున్న స్పీడ్‌కు సీనియర్ భామలంతా షాక్ అవుతున్నారు. ఇటీవల ఆమెపై అఫైర్లకు సంబంధించిన రూమర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొన్నాళ్లపాటు సిద్ధార్థ మల్హోత్రాతో అలియా లవ్ అఫైర్ నడింపించేసింది. అయితే ఈమధ్య వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారని అంతా అనుకున్నారు. అఫైర్ గురించి కానీ… బ్రేకప్ గురించి కానీ ఎప్పుడు ఈ చిన్నది నోరు విప్పలేదు. కానీ ఇన్‌డైరెక్ట్‌గా ఓ విషయాన్ని వెల్లడించింది. నిజ జీవితంలో ఎప్పుడైనా హార్ట్ బ్రేక్ అయిందా? అని అలియాను అడిగితే… “అలా చాలాసార్లే జరిగింది. మనం ప్రేమించిన వాళ్లు తిరిగి మనల్ని అంతగా ఇష్టపడడం లేదని అనిపించినప్పుడు హార్ట్‌బ్రేక్ సహజమే కదా”అని చెప్పింది. ఇటీవల ఇలా ఏదైనా జరిగిందా అని అడిగితే.. “ఈమధ్య నాకు హార్ట్‌బ్రేక్ వంటివేమీ లేవు”అని అంది అలియా. దీంతో సిద్ధార్థ మల్హోత్రాతతో బ్రేకప్ జరగలేదనే విషయాన్ని ఈవిధంగా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పిందని అంటున్నారు బాలీవుడ్ జనాలు.