అల్లాణి శ్రీ‌ధ‌ర్ ‘డూ డూ ఢీఢీ’ (హాయిగా ఆడుకుందామా)

తెలుగు లో మ‌న‌కు బాల‌ల చిత్రాలు చాలా త‌క్కువ‌గా వ‌స్తుంటాయి అప్పుడెప్పుడో ‘పాపం ప‌సివాడు’ ..ఆ త‌రువాత‌’బాల‌రాజు క‌థ’, ‘సిసింద్రీ’. ‘భద్రం కొడ‌కో’ ఇలా అరుదుగా ప‌ల‌క‌రిస్తుంటాయి. ‘కొమురం భీమ్’, ‘గౌతంబుద్ధ’ వంటి అవార్డులు సాధించిన ఉత్త‌మాభిరుచి గ‌ల చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌క నిర్మాత అల్లాణి శ్రీ‌ధ‌ర్ త‌న ఫిల్మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై ‘డూడూ ఢీ ఢీ’ ( హాయిగా ఆడుకుందామా) అనే చిత్రాన్ని తీస్తున్నారు.

ఈ నాడు ప్ర‌పంచ వ్యాప్తంగా బాల‌ల మాన‌సిక వికాసాన్ని దెబ్బ తీస్తున్న ఒకానొక వ్య‌స‌నాన్నిఎత్తి చూపుతూ… భార‌తీయ జీవ‌న విధానంలోని ప‌రిష్కారాల‌ను సూచిస్తూ… ఆద్యంతం ఆస‌క్తి క‌రంగా సినిమా ఉంటుంది. గ‌తంలో అంత‌ర్జాతీయ బాల‌ల చిత్రానికి జూరీ ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన అనుభవం, లిటిల్ డైరెక్ట‌ర్స్ అభిప్రాయాలు తెలుసుకోవ‌డం, ఫిలిం అధ్య‌య‌న విద్యార్థిగా ఇరాన్ వంటి అగ్రశేణి బాల‌ల చిత్రాల శైలి ప‌ట్ల అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చుకోవ‌డం ఈ చిత్ర రూప‌క‌ల్పన‌కు దోహ‌ద ప‌డింది ..అని చిత్రద‌ర్శ‌కుడు నిర్మాత అల్లాణి శ్రీ‌ధ‌ర్ అన్నారు.

ఈ సినిమా షూటింగ్ వ‌రంగ‌ల్ , రంగాపూర్, హైద‌రాబాద్ ప్రాంతాల్లో జ‌రుపుకుంది.

ఈ సినిమాలో కొమురం భీమ్ ఫేం భూపాల్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా వింజ‌మూరి మ‌ధు,మాస్టర్ సాయి, మాస్ట‌ర్ అభి, బేబి కావేరి,స్వ‌ప్న, సంగ‌కుమార్ లు ఇత‌ర పాత్ర‌ల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ః డాక్ట‌ర్ రామ‌చంద్ర వార‌ణాసి, స‌హ‌నిర్మాతః చింతా కిర‌ణ్ కుమార్,  స‌మ‌ర్ప‌ణః  శ్రీ‌మ‌తి చింతా ల‌క్ష్మి నాగేశ్వ‌ర‌రావు, ర‌చ‌న, నిర్మాణం, ద‌ర్శ‌క‌త్వంః అల్లాణి శ్రీ‌ధ‌ర్, `