ఇబ్బంది పెడుతోందంటూ ఒకటే విమర్శలు, వివాదాలు !

`ప్రేమ‌మ్‌` సినిమాతో ఎంతో మందిని త‌న అభిమానులుగా చేసుకున్న సాయిప‌ల్ల‌వి `ఫిదా` సినిమాతో తెలుగునాట సంచ‌ల‌నం సృష్టించింది. ఆ సినిమాతో టాలీవుడ్‌లో ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయింది. మంచి న‌టిగా, అద్భుత డ్యాన్స‌ర్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ త‌ర్వాత ఆమె గురించి ప‌లు వివాదాలు మొద‌ల‌య్యాయి. ఆమెకు కాస్త పొగ‌రెక్కువ‌ని, షూటింగ్‌ల‌కు చాలా ఆల‌స్యంగా వ‌స్తుంద‌ని, హీరోల‌తో గొడ‌వ పెట్టుకుంద‌ని గాసిప్‌లు వ‌చ్చాయి.
ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో… ‘కణం’ చిత్రంలో ఆమెతో కలిసి నటిస్తున్న నాగ‌శౌర్య సాయిప‌ల్ల‌విపై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశాడు. సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం త‌న అభిమాన న‌టుడు సూర్య‌తో ఓ సినిమా చేస్తోంది. సెల్వ‌రాఘ‌వ‌న్ డైరెక్ష‌న్ చేస్తున్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు కూడా సాయిప‌ల్ల‌వి ఇబ్బందిగా మారింద‌ని కోలీవుడ్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈమె తీరుతో ద‌ర్శ‌కుడు ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని స‌మాచారం. ఎప్ప‌టిలాగానే ఆమె ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేద‌ని, షూటింగ్‌కు ఆల‌స్యంగా వ‌స్తోంద‌ని కంప్లైంట్లు వ‌స్తున్నాయి. మ‌రి, ఈ వార్త‌ల‌కు సాయిప‌ల్ల‌వి స్పంద‌న ఏంటో చూడాలి….
నా పంథాలో నేను వెళ్ళిపోతాను అంతే !  
దర్శకులు గొప్పవారే కావచ్చు….కథ నచ్చకపోతే ఎలా చేస్తాను? అలా చేస్తే పాత్రకి తగిన న్యాయం చేయలేను.  అందుకే చేయనని చెప్పాను. ఈ  విషయాల్లో కోలీవుడ్‌లో చాలా మంది నన్ను తప్పు పట్టారు. ఒకటి రెండు సక్సెల కే  సాయిపల్లవికి పొగరెక్కిందనీ, ఎవరి మాటా వినదని అన్నారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా పంథాలో నేను వెళ్ళిపోతాను అంతే! ….. అని చెబుతోంది తనపై వస్తున్న కొన్ని  విమర్శలను ఉద్దేశించి సాయి పల్లవి.

కొందరి దృష్టిలో అందాల ఆరబోతనే గ్లామర్‌ అనుకుంటారు. అలా అనుకుని నా దగ్గరకు కొందరు వచ్చారు కూడా!  గ్లామర్‌ పేరుతో అందాల ఆరబోత నాకు ఇష్టం ఉండదు. ఇక లిప్‌లాక్‌లు లాంటివి నా వల్ల కాదు. నేను మధ్య తరగతి అమ్మాయిని. అలాంటి వాటికి మా పేరెంట్స్‌ అస్సలు ఒప్పుకోరు. నేను సినిమాలు చేస్తానంటే వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టారు. అందులో లిప్‌లాక్‌లు ఒకటి. కెరీర్‌ కోసం మనసు చంపుకోలేను.  ఇంకో విషయం….సినిమాలే నా కెరీర్ కాదు. డాక్టరుగా స్థిరపడాలన్నదే నా కోరిక. వీలున్నంత వరకూ సినిమాలు చేసి ఆ తరువాత డాక్టర్‌గా స్థిరపడతాను. కార్డియాలజిస్ట్‌గా స్థిరపడాలన్నది నా లక్ష్యం.