ఎవ‌రో భ‌య‌ప‌డిన‌ట్టు నేను భ‌య‌ప‌డను !

“స్టార్ డ‌మ్ ను చూసి నేను ఇక్క‌డికి రాలేదు. నేను ప‌దిహేనేళ్ల వ‌య‌స్సులో సినిమాల్లో ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టిన‌పుడు.. నేను కెమెరా ముందు నిల‌బ‌డాల‌నుకున్నా. నేను ఎంచుకున్న మార్గంలో ఏం దొరికినా స‌రే! అనుకున్నా . అదృష్ట‌వ‌శాత్తు నాక‌లాంటి స్టార్ డ‌మ్ రావ‌డమే కాకుండా.. కొన‌సాగుతోంది . కానీ స్టార్‌డ‌మ్  కోసం నేను సినిమాల్లోని రాలేదు. ప్ర‌తీ రోజు సెట్స్ కు వెళ్లినపుడు ఆ ఎక్జ‌యిట్‌మెంట్ గొప్ప అనుభూతినిస్తుంది. అయితే క‌ష్ట‌ప‌డి సంపాదించిన స్టార్ డ‌మ్ ను ఎవ‌రూ కోల్పోరు. స్టార్ డ‌మ్ విష‌యంలో ఎవ‌రో భ‌య‌ప‌డిన‌ట్టు తాను భ‌య‌ప‌డ‌న”ని చెప్పుకొచ్చింది తమ‌న్నా…స్టార్ డ‌మ్ విష‌యంపై  నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడుతూ…

అన్ని స్క్రీన్ లను బ్యాలెన్స్‌ చేస్తూ… సిల్వర్‌ స్క్రీన్, స్మాల్‌ స్క్రీన్, డిజిటల్‌ స్క్రీన్‌లను బ్యాలెన్స్‌ చేస్తూ ఆల్‌ రౌండర్‌ అనిపించుకుంటోంది  తమన్నా.  ‘లెవన్త్‌ అవర్‌’, ‘నవంబర్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌లతో డిజిటల్‌ స్క్రీన్‌పై సత్తా చాటిన తమన్నా తాజాగా మరో వెబ్‌ ఫిల్మ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ‘ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి’లో నటిస్తున్నారు తమన్నా. ఇందులో హీరోయిన్‌ జెనీలియా భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌  మరో లీడ్‌ యాక్టర్‌. ఇటీవలే షూటింగ్‌ మొదలైంది. ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు. ‘ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి’లో మ్యారేజ్‌ బ్యూరో ప్రతినిధిగా తమన్నా, విడాకులు ఇప్పించే లాయర్‌గా రితేష్‌ కనిపిస్తారట. స్మాల్‌ స్క్రీన్‌ విషయానికొస్తే.. తమన్నా హోస్ట్‌గా చేస్తున్న ‘మాస్టర్‌ చెఫ్‌’  వంటల ప్రోగ్రామ్‌ త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక సిల్వర్‌ స్క్రీన్‌పై తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్‌’, ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘ఎఫ్‌ 3’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

వరుణ్‌ తేజ్‌తో స్పెషల్‌ సాంగ్‌… ‘గని’ చిత్రంలో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా చేస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “గని”. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమాకి సంబంధించిన తుది షెడ్యూల్ చిత్రీకరణ జరుపు కుంటోంది .ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ మిగిలి ఉంది. ఈ సాంగ్ లో  ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉండగా.. మిల్క్ బ్యూటీ తమన్నా అయితే సరిపోతుందని భావించిన  మేకర్స్ తమన్నాను సంప్రదించినట్టు తెలుస్తోంది. తమన్నాకు స్పెషల్ సాంగ్ చేయడం కొత్తేమీ కాదు. ఇదివరకే మహేష్ బాబు సినిమాలో  ‘డ్యాంగ్ డ్యాంగ్‌…’ అంటూ మహేష్ సరసన ఆడిపాడి ప్రేక్షకుల మనసును దోచింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా సంచలన విజయం సృష్టించిన కేజిఎఫ్ సినిమాలో ‘దోచెయ్ దోర సొగ‌స‌లు దోచెయ్ ..’ అంటూ ఆడిపాడింది. ఇది మాత్రమే కాకుండా ఇంతకుముందు అల్లుడు శీను, జాగ్వార్, జై లవకుశ వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి కుర్రకారును మెస్మరైజ్ చేసింది. త‌మ‌న్నా కు ఇన్ స్టాగ్రామ్ లో 14.3 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లుండగా..ట్విట‌ర్ లో 5.1 మిలియ‌న్ల మంది ఉన్నారు.