అల్లు అర్జున్ లో ‘తేడా’ వచ్చిందట !

“సక్సెస్” అనేది ఎవరిలోనైనా గర్వానికి దారితీస్తుంది . ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే సాధ్యం. అల్లు అర్జున్ ఇప్పుడు మంచి సక్సెస్ జోరులో ఉన్నాడు . సక్సెస్ వల్ల అతని లో స్పష్టమైన తేడా కనిపిస్తోందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు . ఒక ఫంక్షన్ లో అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే … ‘చెప్పను బ్రదర్’ అంటూ నిరాకరించి పవన్ కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు అల్లు అర్జున్. ఇటీవల ‘దువ్వాడ జగన్నాధం’ సక్సెస్ తర్వాత ఒక పర్సనల్ పార్టీ లో ‘ఇక మెగా హీరోల్లో నేనే నంబర్ వన్’ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేసాడని చర్చించుకుంటున్నారు .

తాజాగా తమిళ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుడి ముందు ఆ కూర్చోవడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొ. కబడ్డీ లీగ్‌కు ప్రస్తుతం ఎంత ఆదరణ లభిస్తోందో తెలిసిందే. ఆ ఆదరణతోనే ‘తమిళ తలైవార్’ టీంను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్, రామ్‌చరణ్ . ఆ టీంకు కమల్ హాసన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నారు. గురువారం సాయంత్రం చెన్నైలో టీం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అల్లు అర్జున్, రామ్‌చరణ్. వారితో పాటు కమల్ హాసన్ కూడా వచ్చారు.

అయితే వేడుకలో మాట్లాడుతుండగా.. కమల్ హాసన్, రామ్ చరణ్ తేజ్ మామూలుగానే కూర్చున్నారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం కాలుమీద కాలేసుకుని కూర్చున్నారు. ఇదే తమిళ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడే నిరాడంబరంగా కూర్చుంటే.. అంత పెద్ద వ్యక్తి ముందు అలా కాలుమీద కాలేసుకుని కూర్చోవడమేంటని బన్నీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్నచిన్న విషయాలను బన్నీ పట్టించుకోకపోవడమేంటని తమిళ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీంతో, అల్లు అర్జున్ కు సక్సెస్ తలకెక్కిందని సోషల్ సైట్లలో నెటిజన్లు కామెంట్స్ విసురుతున్నారు