ఆ సినిమాతో అసలు సంబంధమే లేదంటున్న ‘సూర్య’

వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేస్తున్న మూవీ ‘నా పేరు సూర్య‌’.  ఈ మూవీ ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన వీడియోలు అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెంచ‌గా, కొందరిలో మాత్రం అనేక అనుమానాలు క‌లిగించాయి. బ‌న్నీ చిత్రం ‘యాంట్ వోన్ ఫిషర్’ అనే ఆంగ్ల మూవీకి కాపీగా ఉన్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంద‌ని ప‌లువురు ప్ర‌చారం చేశారు. ఈ వార్త చిత్ర యూనిట్ చెవికి చేర‌డంతో వెంట‌నే వారు దానిపై క్లారిటీ ఇచ్చారు. దర్శకుడితో పాటూ చిత్ర టీమ్ అంతా కూడా తమ సినిమా ఏ మూవీకి కాపీ కాదని చెబుతున్నారు. ‘యాంట్ వోన్ ఫిషర్’ సినిమాకు తమ సినిమా అసలు సంబంధమే లేదని వారు అంటున్నారు. ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ‘అజ్ఞాత‌వాసి’ చిత్రం ఫ్రెంచ్ మూవీ ‘లార్గోవించ్‌’కి కాపీ అని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ‘ఇది నిజ‌మే’ అని ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ట్వీట్ ద్వారా తెలియ‌జేశాడు. మ‌రి బ‌న్నీ మూవీ కాపీనా కాదా? అనేది తేలాల్సి ఉంది. అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బ‌న్నీ చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం.

 ఏడు భాషల్లో విడుదలకు సన్నాహాలు ! 

‘స్టైలిష్‌ స్టార్‌’​ అల్లు అర్జున్‌కు తెలుగుతోపాటు మళయాళంలోనూ మంచి మార్కెట్‌ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ మాదిరిగా ఆడిన చిత్రాలు కూడా.. అక్కడ బ్లాక్‌ బస్టర్‌లు అయ్యాయి. అలాంటిది బన్నీ ఇప్పుడు తన మార్కెట్‌ పరిధిని మరింత విస్తరించుకునే పనిలో పడ్డాడు.

అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం ‘నా పేరు సూర్య’ను ఏడు భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్‌, హిందీ, మళయాళం, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుందని సమాచారం. దేశ భక్తికి సంబంధించిన కంటెంట్‌ కావటంతో అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుందన్న కాన్ఫిడెంట్‌లో మేకర్లు ఉన్నారంట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కథా రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తుండగా… నాగబాబు, బన్నీవాస్‌లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌ కాగా, సీనియర్‌ నటుడు అర్జున్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విశాల్‌-శేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.