అల్లు అర్జున్ సొంత బ్యాన‌ర్.. రానా యూ ట్యూబ్‌ ఛానెల్!

అల్లు అర్జున్ సొంత బ్యాన‌ర్ ను మొద‌లుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వెబ్ సిరీస్ ల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ బ్యాన‌ర్ ను త్వ‌ర‌లోనే లాంఛ్ చేయ‌నున్నాడు బ‌న్నీ. లాక్ డౌన్ స‌మ‌యంలో అల్లు అర్జున్ చాలా క‌థ‌ల‌ను విన్నాడ‌ట‌. అయితే ఆ క‌థ‌ల‌ను సినిమాలుగా తీసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో..వాటిని వెబ్ సిరీస్ లుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నాడ‌ట‌. టాలెంట్ ఉన్న కొత్త వారికి ఇండ‌స్ట్రీలో అవ‌కాశం ఇవ్వాల‌ని ఫిక్స‌యిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వర్గాల టాక్‌. తెలుగు ప్రేక్ష‌కులకు  కొత్త‌ద‌నంతో కూడిన క‌థ‌లు అందించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వీటిలో ప్ర‌ముఖుల జీవితక‌థ‌ల‌ను చెప్పే బ‌యోపిక్స్ కు ఎక్కువ ప్రాధాన్య‌మివ్వాల‌నుకుంటున్నాడ‌ట‌.

రానా ‘యూ ట్యూబ్‌ ఛానెల్’..‌ ‘సౌత్ బే’… లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్స్‌ మూతపడటంతో ప్రేక్షకులు ఓటీటీలు సహా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ మాధ్యమాలకు అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి ఓ సొంత యూ ట్యూబ్‌ ఛానెల్‌ను స్టార్ట్‌ చేశాడు. తన యూ ట్యూబ్‌ ఛానెల్‌కు ‘సౌత్ బే’ అనే పేరు పెట్టాడు రానా.  పలు భాషల్లో కంటెంట్‌ను ఈ యూట్యూబ్‌ ఛానెల్‌లో చూడొచ్చు. పది సెకన్ల నుండి పది గంటల నిడివితో పలు భాషలకు సంబంధించిన కథలు ఇందులో అందుబాటులో ఉంటాయి. టాలెంట్‌ ఉండి కంటెంట్‌ జనరేట్‌ చేయాలనుకునే వారికి తగు అవకాశాలను ఈ ఛానెల్‌లో కలిగించబోతున్నారు రానా. ఇందులో కేవలం కథలే కాకుండా న్యూస్‌, యానిమేషన్‌, ఫిక్షన్‌ అంశాలకు సంబంధించిన వివరణ కూడా ఉంటుందట.