అల్లు అర్జున్‌ భారీ బడ్జెట్‌ ‘పాన్ ఇండియా’ సినిమా ?

యువహీరో అల్లు అర్జున్‌ బాలీవుడ్ మీద దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.బాలీవుడ్ మన దేశంలో సినిమాలకు వందల కోట్ల బిజినెస్ జరిగే పెద్ద మార్కెట్. దక్షిణాది నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్‌కు మాత్రమే బాలీవుడ్‌లో కొంత ఆదరణ ఉండేది. రజినీకాంత్‌ తన కెరీర్ ప్రారంభం నుండి కొన్ని హిందీ సినిమాలు చేసారు. ఇటీవల ప్రభాస్ కూడా ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో బాలీవుడ్‌పై పట్టు సాధించాడు. ఎన్టీయార్, రామ్‌చరణ్ కూడా అదే ఆలోచన…ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా బాలీవుడ్ మీద దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. అర్జున్‌ కి తెలుగుతోపాటు.. మలయాళంలోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.ఈ మధ్య తమిళంలో కూడా సినిమా చేయాలని భావించాడు కానీ అది సెట్ కాలేదు. ప్రస్తుతం హిందీ మీద బన్నీ దృష్టి పెట్టాడట. బన్నీ నటించిన హిందీ డబ్బింగ్ వెర్షన్లకు హిందీ చానల్స్ లో, యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నాడట. తన దగ్గరకు వచ్చే దర్శకులను అలాంటి కథలు రెడీ చెయ్యమని చెబుతున్నాడట. అన్నీ కుదిరితే బన్నీ కూడా భారీ బడ్జెట్‌తో ఓ పాన్ ఇండియా సినిమా త్వరలో చేయబోతున్నాడు .
థాయ్‌లాండ్ ఆడ‌వుల్లో కీల‌క స‌న్నివేశాలు
అల్లు అర్జున్..సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఆర్య‌’, ‘ఆర్య 2’ చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌ కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. చిత్తూరుజిల్లా బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ముందుగా ఈ సినిమా కీల‌క స‌న్నివేశాల‌ను న‌ల్ల‌మ‌ల ఆడ‌వుల్లో చిత్రీక‌రించాల‌నుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం… ఇప్పుడు న‌ల్ల‌మ‌ల ఆడ‌వుల్లో చిత్రీక‌రించాల్సిన స‌న్నిశాల‌ను థాయ్‌లాండ్ ఆడ‌వుల్లో చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌.