విరామం తర్వాత… మూడు సినిమాల ముచ్చట !

ప్రస్తుతం స్టార్‌ హీరోలు ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేస్తున్నారు.ఇటీవల పరాజయాలతో కొంత విరామం అనంతరం .. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా బన్నీ మూడు ప్రాజెక్ట్‌లను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తన 19వ చిత్రంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది ఇటీవలే ప్రారంభమైంది. ఈ నెల 24 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ని కూడా జరుపుకోనుంది. 20వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో ఉంటుందని, 21వ సినిమా ‘ఎంసీఏ’ ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించారు. దీనికి ‘ఐకాన్‌'(కనబడుటలేదు) అనే టైటిల్‌ని కూడా కన్ఫమ్‌ చేశారు. అయితే ఇప్పుడు సినిమాల ఆర్డర్‌ మారబోతోందని సమాచారం. 20వ చిత్రంగా వేణు శ్రీరామ్‌ ‘ఐకాన్‌’ ఉంటుందట. దిల్‌రాజు నిర్మించే ఈ స్క్రిప్ట్‌ ఇప్పటికే రెడీగా ఉందని, త్రివిక్రమ్‌ సినిమా పూర్తి కాగానే వేణు ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సుకుమార్‌ స్క్రిప్ట్‌పై ఇంకా వర్క్‌ చేస్తున్న నేపథ్యంలో ఈలోపు ‘ఐకాన్‌’ని పూర్తి చేయాలని బన్నీ భావిస్తున్నట్టు టాక్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాకి ‘అలకనంద’ అనే టైటిల్‌ వినిపిస్తోంది. ‘అ..’ అనే అక్షరంతో టైటిల్స్‌ పెట్టడాన్ని ఇటీవల త్రివిక్రమ్‌ సెంటిమెంట్‌గా భావిస్తున్నట్టుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, గీతా ఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
 
బన్నీ డ్యూయల్‌ రోల్‌
2003లో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయిన బన్నీ ఇప్పటి వరకు 18 సినిమాల్లో హీరోగా నటించాడు. బన్నీ చేయబోయే 19, 20వ సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈసినిమాలన్నింటిలో బన్నీ ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ తొలిసారిగా బన్నీ డ్యూయల్‌ రోల్‌కు ఓకె చెప్పాడట.ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ‘ఐకాన్‌’ అనే సినిమాను ప్రకటించారు. ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీ రామ్‌ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడట. అంతుకాదు రెండు పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. త్రివిక్రమ్‌, సుకుమార్ సినిమాలు పూర్తయిన వెంటనే ఐకాన్‌ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.