అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల చిత్రం ప్రారంభం !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 6 , గీతాఆర్ట్స్, ల చిత్రం ఈరోజు (13 – 4 – 19 ) ఉదయం హైదరాబాద్ లో 10 గంటల 50 నిమిషాలకు ప్రారంభం అయింది.
హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ చిత్రం. కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే చిత్రం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 24 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ,రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, మరియు ప్రత్యేక పాత్రలో ‘సుశాంత్’
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటింగ్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్,నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
 
Stylish Star Allu Arjun – Trivikram Srinivas movie pooja ceremony 
Stylish Star Allu Arjun and Wordsmith Trivikram Srinivas’s new movie Pooja Ceremony has been completed this morning at Ramanaidu Studios. Prestigious organizations ‘Haarika & Haasine Creations’ – Production No 6,’Geetha Arts, to start the regular shoot from April 24th 2019. Co-Starring Pooja Hegde.
 
Stylish Star Allu Arjun and wordsmith Trivikram Srinivas are coming together for the 3rd time after Julayi and S/O Satyamurthy. Fans of this combination have huge expectations and prestigious production houses Haarika & Hassine Creations and Geetha Arts are coming together to make all their wishes come true.
The pre-production works for the movie are completed. Regular Shoot starts from April 24th in Hyderabad says producers.
 
Other Star Cast: Tabu, Satyaraj, Rajendra Prasad, Sunil, Navdeep, Brahmaji, Rao Ramesh, Murali Sharma, Rahul Ramakrishna.Special Appearences: Sushanth
Cinematography: P.S. Vinod,Music: Thaman S,Editing: Navin Nooli
Art: A.S. Prakash,Fights: Ram – Lakshman
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)