అల్లు అర్జున్ హీరోయిన్ గా రష్మిక ?

తన మూవీ ‘డీజే’ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు  అల్లు అర్జున్. రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాకు ‘నా పేరు సూర్య’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మండన్న కూడా బన్నీతో రొమాన్స్ చేసే రేసులో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.

కన్నడంలో తెరకెక్కిన ‘కిరాక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక… తొలి సినిమాతోనే హిట్ దక్కించుకోవడంతో పాటు బాగా పాపులర్ అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మకు ఏకంగా ప్రభాస్ నయా మూవీ ‘సాహో’లో ఛాన్స్ దక్కిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆమెకు అంత లక్ లేకుండా  పోయింది. తాజాగా అల్లు అర్జున్ కొత్త  మూవీ కోసం బన్నీ, వక్కంతం వంశీ ఆమెను ప్రిఫర్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.

పూజా హెగ్డేకు ‘డీజే’ సినిమాలో అవకాశం వచ్చినట్టే… రష్మీకకు ‘నా పేరు సూర్య’లో ఛాన్స్ దక్కొచ్చనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయిన రష్మిక… ‘కిరాక్ పార్టీ’ చిత్ర దర్శకుడు రక్షిత్‌తో ప్రేమాయణం సాగిస్తోందనే రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా.. రష్మికకు అర్జున్ సరసన నటించే ఛాన్స్ దక్కితే ఆమె గొప్ప అదృష్టవంతురాలే.