సాహసం చేసింది… నష్టపోయింది !

(ఆమె)‘ఆడై’ సినిమాలో అమలాపాల్‌ న్యూడ్‌గా బోల్డ్‌ సీన్స్‌లో నటించడంతో సినిమా గురించి అందరిలో ఆసక్తి పెరిగింది. దాని గురించి తమిళ మీడియాలో చాలా ప్రముఖంగా కథనాలు వచ్చాయి. కొందరు విమర్శిస్తూ కామెంట్స్‌ చేస్తే మరి కొందరు సినిమాను గొప్పగా ప్రమోట్‌ చేశారు. అమలాపాల్‌ చేసిన సాహసానికి .. నటనకు విశేష ప్రసంశలొచ్చాయి. కాని సినిమా విడుదలైన తర్వాత ఆ సీన్స్‌ ఏమాత్రం సినిమాకు ఉపయోగపడలేదు.కనీసం ఆ సీన్స్‌ వల్ల మొదటి వారం రోజులు కూడా ఆడే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఆడై సినిమా అక్కడ ఇక్కడ బొక్క బోర్లా పడ్డట్లయ్యింది.
 
సినిమా ఫలితం హీరోయిన్స్‌కు పెద్దగా ప్రభావం ఉండదు. కాని ఈ చిత్రం ఫ్లాప్‌ హీరోయిన్‌ అమలాపాల్‌కు ఆర్ధికంగా చాలా పెద్ద నష్టం తెచ్చింది.ఎందుకంటే సినిమా విడుదలకు ముందు ఆర్థికపరమైన ఇబ్బందులతో నిర్మాత ఉన్న సమయంలో అమలాపాల్‌ తనకు ఇచ్చిన పారితోషికం రిటర్న్‌ ఇవ్వడంతో పాటు తన సొంత డబ్బును కూడా కొంత మొత్తం ఇచ్చింది.సినిమా సక్సెస్‌ అయితే నిర్మాత అమలాపాల్‌కు రెండు కోట్ల రూపాయలు ఇస్తానంటూ హామీ ఇచ్చాడట. కాని ఇప్పుడు సినిమా కనీసం వసూళ్లు కూడా రాబట్టలేక పోతుంది. సినిమా తెలుగు మరియు తమిళంలో రెండు చోట్ల కూడా ఫ్లాప్‌ అయ్యింది.దాంతో అమలాపాల్‌కు రూ. 2 కోట్లు పోయినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాపై ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తోనే ఆమె డబ్బులు ఇచ్చిందని..జాలి చూపుతున్నారు.
 
లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ లో…
ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తాను మళ్లీ ప్రేమలో పడ్డానని, అయితే ఆ వ్యక్తి సినిమా రంగానికి చెందిన వారు కాదని అమలా పాల్ తెలిపింది. తాజాగా దీనిపై మరింత క్లారిటీ ఇచ్చింది. తాను ప్రేమలో పడ్డానని, ప్రస్తుతం అతనితో పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నానని చెప్పింది. అలాగే, ప్రస్తుతం తాను ఇలా ఉండటానికి కారణం ఆయనేనని, తాను చాలా అప్సెట్‌లో ఉన్న సమయంలో అతని పరిచయం ఏర్పడిందని తెలిపింది. తన గురించి అతనికి అన్ని విషయాలు బాగా తెలుసునని, తన కెరియర్‌ కోసం అతను ఉద్యోగం కూడా వదులుకున్నారని.. తన ప్రియుడు గురించి తెలిపింది. అయితే అయిన పేరు మాత్రం బయట పెట్టలేదు.
 
డేటింగ్ గురించి…
నేను అంత ఈజీగా డేటింగ్‌కు వెళ్ల‌ను. నాకు న‌చ్చిన వ్య‌క్తితో గాఢ‌మైన అనుబంధం ఉంటేనే వెళ‌తాను. లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ మంచిదే. ఇది వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే. ఎందుకంటే అరెంజ్ మ్యారేజ్‌లో ఒత్తిడి ఉంటుందనుకుంటాను. మ‌న‌కు తెలియ‌ని వ్య‌క్తితో క‌లిసి ఉండ‌టం, ఎదుటి వ్య‌క్తిని అర్థం చేసుకోవ‌డం, వంట వండ‌టం .. ఇలా చాలా ప‌నులు మ‌న‌లో తెలియ‌ని ఒత్తిడిని క‌లిగిస్తాయి. అదే లివిన్ రిలేష‌న్ షిప్‌లో ఉంటే.. ఒక‌రినొక‌రు అర్థం చేసుకునేదానికి స‌మ‌యం ఉంటుంది. ప్ర‌స్తుతం ఒక వ్య‌క్తితో రిలేష‌న్‌లో ఉన్నాను. త‌న‌ది చాలా అంద‌మైన మ‌న‌సు.