నా బొడ్డు వల్ల ఇంత ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌నుకోలేదు !

అమ‌లాపాల్‌.. హీరోయిన్‌గా స్టార్‌స్టేట‌స్ అందుకోలేక‌పోయినా వివాదాల్లోమాత్రం ఈమె పేరు ఎప్పుడూ నానుతూనే ఉంటుంది. చిన్న వ‌య‌సులోనే పెళ్లి చేసుకోవ‌డం, వెంట‌నే విడాకులు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. త‌ర్వాత సుచీలీక్స్‌, ఇటీవ‌ల కారు రిజిస్ట్రేష‌న్ వివాదం ఆమెను వివాదాల్లోకి లాగాయి. తాజాగా మ‌రోసారి అమ‌లాపాల్ గురించి హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది.
అమ‌ల తాజాగా న‌టించిన చిత్రం `తిరుట్టుప‌య‌లే-2`. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌లో అమ‌ల చాలా హాట్‌గా క‌నిపించింది. దీంతో దీని గురించే అంద‌రూ చ‌ర్చించుకంటున్నారు. తాజాగా దీనిపై అమ‌ల కూడా కాస్త హాట్‌గానే స్పందించింది. `నా బొడ్డు అంత‌లా సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌నుకోలేదు. నాభి ప్రాంతానికి కొంచెం కింద‌కి చీర క‌డితే అంత ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌నుకోలేదు. ఇప్పుడు మ‌నం 2017లో ఉన్నాం. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోవాలి` అంటూ త‌న‌దైన శైలిలో స్పందించింది.
ఆ ఆనందం నీ మనసుకు తెలియాలి !

ఎన్ని రోజులు ఇలా! ఒకేలా! ఎప్పడూ అలాగే ఉంటే.. లైఫ్‌ అనే రెయిన్‌బోకు రంగులు దిద్దేది ఎప్పుడు? అనుకున్నారు అమలాపాల్‌. అనుకున్న వెంటనే కాళ్లు, కళ్లు, కలలు గడప దాటాయి. డైరెక్ట్‌గా హిమాలయాలకి వెళ్లిన అమలాపాల్‌…  ఏ దిక్కులో ఏమున్నదో వెంటాడి జ్ఞాపకాలను పోగు చేసుకుందామనుకున్నారు. కాలినడన వెళితే టైమ్‌ వేస్ట్‌. పోనీ బస్సులో వెళితే ఎన్ని స్టాప్‌లో.

అందుకే లాభం లేదని బుల్లెట్‌ బైక్‌ ఎక్కేశారు. సరౌండింగ్స్‌లో ఉన్న బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌ని రౌండప్‌ చేస్తున్నారు. ఇన్‌సెట్‌లో ఉన్న అమలాపాల్‌ ఫొటోలు చూస్తుంటే ఏ రేంజ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారో అర్థం అవుతోంది కదా.  ‘‘మన ఆలోచనలకు రెక్కలు రావడం కాదు ఫ్రీడమ్‌ అంటే. అది పర్సన్‌కు ఎటాచ్‌ అయి ఉండదు. భరించలేనంత ఆనందంగా ఉండటమే ఫ్రీడమ్‌ అంటే. ఆ ఆనందం నీ మనసుకు తెలియాలి’’ అని చెబుతున్నారామె.