నా తొలి ప్రేమికుడు అతనే !

సంచలనం అన్న పదానికే మారుపేరుగా మారిన నటి అమలాపాల్‌ తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లో కెక్కడం చూస్తూనే ఉన్నాం. నటిగా ఎంత వేగంగా ఎదిగిందో అంతే త్వరగా దర్శకుడు విజయ్‌తో ప్రేమలో మునిగి తేలి పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే, అంతే వేగంగా ఆయన నుంచి విడిపోయి విడాకులు కూడా తీసుకుని మళ్లీ నటించడానికి వచ్చేసింది. తాజాగా ఈ అమ్మడు మరో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో కెక్కే ప్రయత్నం చేసింది…. దర్శకుడు విజయ్‌తో ప్రేమ కంటే ముందే మరొకరిని ప్రేమించానని  చెప్పింది.

ఇటీవల ఒక కార్యక్రమంలో అమలాపాల్‌ పేర్కొంటూ తనకు తొలిప్రేమ కథ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన మొదటి ప్రేమ అనుభవం గురించి మాట్లాడుతూ.. తానిప్పుడు నచ్చిన చిత్రాలను ఎంచుకుని నటిస్తున్నానని చెప్పింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇప్పుడు చాలా మందికి మొదటి ప్రేమ ఉంటుందని అలా తనకు తొలిప్రేమ కథ ఉందని చెప్పింది.తన మొదటి ప్రేమికుడు ఎవరో కాదని, నటుడు మాధవన్‌ అని చెప్పింది. మాధవన్‌ అంటే తనకు చిన్నతనం నుంచి చాలా ఇష్టం అని పేర్కొంది. తన తొలి ప్రేమికుడు ఆయనేనని చెప్పింది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు నటుడు మాధవన్‌ ఆమె పక్కనే ఉన్నారు. అమలాపాల్‌ చెబుతుంటే మాధవన్‌ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయారు. అమలాపాల్‌ మాత్రం లేచివెళ్లి ఆయన్ని హగ్‌ చేసుకుంది.

క్యారెక్టరైజేషన్‌తో ప్రయోగాలు 

ట్రెడిషనల్‌ రోల్స్‌తో ఎంట్రీ ఇచ్చి, మెల్లిగా గ్లామరస్‌ రోల్స్‌ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అమలా పాల్‌ ఇప్పుడు కెరీర్‌ని యూ టర్న్‌ తిప్పారు. కొత్త క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. తమిళంలో చేస్తున్న ‘అదో అంద పరవై పోల’లో ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ రోల్‌ చేస్తున్న ఆమె ఇప్పుడు ఏకంగా బ్యాడ్‌ గర్ల్‌గా మారారట.

‘భలేభలే మగాడివోయ్, మహానుభావుడు’ సినిమాలకు కెమెరామేన్‌గా పని చేసిన నిజర్‌ షఫీ దర్శకుడిగా మారి తెలుగు–తమిళ్‌ బైలింగువల్‌ మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నందితా శ్వేత, శ్రద్ధ శ్రీనాథ్, అదితీ ఆర్య, అనీషా ఆంబ్రోస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనే అమలా పాల్‌ విలన్‌గా నటించనున్నారు. ఆమె పాత్ర  1950ల కాలంలో ఉంటుందట. ఇన్వెస్టిగేటీవ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు నిజర్‌ షఫీ కెమెరామేన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.