నాలోని అగ్ని ఎక్కువగా ప్రజ్వరిల్లింది !

దర్శకుడు విజయ్ తో  విడాకులు తీసుకున్న అమలాపాల్‌ కెరీర్‌లో ఎదగకుండా కొందరు  కుట్రలు పన్నుతున్నట్టు వదంతులు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత అమలాపాల్‌ గ్లామర్‌ లో శ్రుతి మించుతోందంటూ విమర్శలువచ్చాయి. అయితే అవేమీ పట్టించుకోకుండా అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది అమలా పాల్‌.

“నేను నిలదొక్కుకోగలిగానంటే అందుకు కారణం … “నా చుట్టూ ఉన్న అగ్ని కంటే, నాలో ఉన్న అగ్ని ఎక్కువగా ప్రజ్వలించడమే”అంటూ అమలాపాల్‌ ట్విట్టర్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. గ్లామరస్‌గా ఉన్న తన ఫొటోతో సహా ఆమె ఈ పోస్టు చేసింది.

అమలాపాల్‌లోనూ ఒక ప్రత్యేకత ఉంది !

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక స్పెషల్‌ క్వాలిటీ ఉంటుంది. అలా నటి అమలాపాల్‌లోనూ ఒక ప్రత్యేకత ఉంది. అది ఈ అమ్మడి సినీ కేరీరే. పెళ్లికి ముందు, ఆ తరవాత అని ఆమె కెరీర్‌ను విభజించవచ్చు. పెళ్లికి ముందు హీరోయిన్‌గా నటించింది తక్కువ చిత్రాలే అయినా అమ్మడు మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక పెళ్లి, విడాకులతో కొంచెం తడబడినా తాజాగా మళ్లీ గాడిలో పడిందని చెప్పవచ్చు. అయితే రీఎంట్రీలో ఇప్పటి వరకూ అమలాపాల్‌ కు సరైన హిట్‌ పడలేదు.

త్వరలో ధనుష్‌తో రొమాన్స్‌ చేసిన ‘వీఐపీ 2’ చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీనిపైనే అమలాపాల్‌ చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ‘తిరుట్టుప్పయలే 2’, ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్’, రెండు మలయాళ చిత్రాలు చేతిలో ఉన్నాయి. మరో తమిళ చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. ఇకపోతే అమలాపాల్‌లో మంచి చెఫ్‌ ఉందట. సమయం దొరికినప్పుడల్లా వంటింట్లోకి ప్రవేశించి రకరకాల చేపల కూరలను వండుతుందట. అదే విధంగా ఒంటరిగా ప‍్రయాణాలు చేయటం అమల హాబీ.