అలాంటి సీన్‌ అవసరమైంది.. అందుకే చేసా !

“సినీ పరిశ్రమలో మంచి సినిమా, చెడ్డ సినిమాలే ఉంటాయి. పెద్ద బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తే కమర్షియల్‌గా విజయం సాధిస్తుందనే నమ్మకం నాకు లేదు. ఏ సినిమా అయినా విజయం సాధిస్తే.. అది కమర్షియల్‌ చిత్రం అవుతుంది”….అని అంటోంది అమల పాల్.
 
#ఇటీవలే ఓ హిందీ చిత్రానికి అంగీకరించా. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా. మునుపటి కన్నా ఇప్పుడు చాలా స్లిమ్‌ అయ్యా. 
 
#నాకు హోమ్లీ గాళ్‌ అనే గుర్తింపు ఉంది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. కానీ ‘ఆడై’ సినిమా పోస్టర్‌ చూసినవారు ‘అరె.. అమలాపాలా ఇది..’ అని ఆశ్చర్యపోతున్నారు. ఆ సినిమాకు అలాంటి సీన్‌ అవసరమైంది. అందుకే గ్లామర్‌గా నటించా. అవసరానికి మించి, కమర్షియల్‌ హంగుల కోసం నేనెప్పుడూ గ్లామర్‌గా నటించను. అంతేకాకుండా ఓ యాడ్‌ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించా.
#తరచు తాను హిమాలయాలకు వెళ్లి వస్తున్నానని… అక్కడ ఉన్న ప్రశాంతత నా జీవితాన్ని మార్చేసిందని ఆమె పేర్కొంది. హిమాలయాల్లోని ప్రకృతి సౌందర్యం ఆధ్యాత్మిక భావనలు కలిగేలా చేసిందని తెలిపింది.
#ఈమధ్య చాలా మంది సినీ తారలు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తాను కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందని అమలాపాల్ చెప్పడం విశేషం. ‘మీరు రాజకీయాల్లోకి వస్తారా?..’ అని చాలా మంది అడుగుతున్నారు. చూద్దాం.. సమయం వస్తే ఏదైనా జరగొచ్చు. నా చేతికి గాయాలైనప్పుడు కూడా కేరళ వరద బాధితుల కోసం సహాయ చర్యల్లో పాల్గొన్నా.