పదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

పదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు & 

మొట్ట మొదటి అమెరికా మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం

సెప్టెంబర్ 23-24, 2017 (శనివారం, ఆదివారం)

ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకూ

Greater Washington DC

మీ అందరి ప్రోత్సాహంతో, 20 సంవత్సరాల క్రితం (1998) ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా జరుగుతున్న ద్వై వార్షిక అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సుల సత్సాంప్రదాయాన్ని అనుసరిస్తూ, మునునెన్నడూ లేనంత ఆసక్తికరంగా 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు అమెరికా రాజధాని వాషింగ్టన్ DC ప్రాంతంలో రాబోయే సెప్టెంబర్ 23-24, 2017 (శనివారం, ఆదివారం) తారీకులలో జరగబోతోంది.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (Capitol Area Telugu Society) సంయుక్తంగా ఈ 10వ అమెరికా సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు.

ఐదు దశాబ్దాలుగా ఉత్తర అమెరికా తెలుగు సాహిత్య వికాసం లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళా రచయితలకి ఒక ప్రత్యేక వేదిక కలిగించి మహిళా రచయితల సాహిత్య దృక్పథానికి పెద్ద పీట వెయ్యడం ఈ సాహితీ సదస్సులో ఒక ప్రధాన అంశం.

లాభాపేక్ష లేని ఈ జాతీయ స్థాయి 10వ అమెరికా సాహితీ సదస్సులో ఉత్తర అమెరికాలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ ఉన్న తెలుగు రచయితలు, పండితులు, విమర్శకులు, వక్తలు, భాషాభిమానులనూ, తెలుగు భాషా, సాహిత్యాల పురోగతిని ఆకాంక్షించే వారినీ, ఆనందించే వారందరినీ పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆసక్తి ఉన్న భారత, తదితర దేశాల ప్రతినిధులని స్వాగతిస్తున్నాం. మాతృదేశం నుంచి కొందరు ప్రముఖ సాహితీవేత్తలను ఆహ్వానించే ఉద్దేశ్యం ఉంది.

సదస్సు ప్రధానాశయాలు

  • గత యాభై ఏళ్ళకి పైగా అమెరికాలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్య ప్రక్రియలలో, ముఖ్యంగా అమెరికా తెలుగు కథ, కవితల ఆవిర్భావం, మారుతున్న పరిణామాలు, ప్రమాణాలు, ఆధునిక పోకడలు మొదలైన సాహిత్య పరమైన విషయాలు నెమరు వేసుకోవడం.
  • అమెరికా మహిళా రచయితల కోసం ఒక ప్రత్యేక వేదికకి రూప కల్పన చేసి వారి సాహిత్య కృషిని గుర్తించి, అమెరికా కథ, కవితల సృజనలో మహిళల అభిప్రాయాలు భావ స్వాతంత్ర్యం,భావ ప్రకటన లో  ఉన్న  ఇబ్బందులు, పరిష్కారాల పై చర్చా వేదిక ఏర్పాటు చెయ్యడం.
  • కథా రచన పై నిష్ణాతులచేత శిక్షణా శిబిరం (వర్క్ షాప్)
  • స్వీయ రచనా పఠనం వేదిక లో రచయితలూ, కవులూ తమ రచనలను సహ సాహితీ ప్రియులకి స్వయంగా వినిపించే అవకాశాలు కలిగించడం.
  • సహ రచయితలను, సాహితీవేత్తలనూ, తెలుగు భాషా, సాహిత్యాభిమానులనూ వ్యక్తిగతంగా, ఆత్మీయ సాహిత్య వాతావరణంలో కలుసుకొని, సాహిత్య పరిచయాలను పెంచుకొనడం,

అదనపు ఆకర్షణలు

నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయ శాల, సరదా సాహిత్య పోటీలు, అందరూ అప్పటికప్పుడు పాల్గొనే గొలుసు కథ, మరెన్నో….

రచయితలకు, వక్తలకు విన్నపం

ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ప్రసంగించదల్చుకున్న వారు, స్వీయ రచనా విభాగంలో తమ రచనలను వినిపించదల్చుకున్నవారూ ఈ క్రింది నిర్వాహకులను  సంప్రదింఛండి. ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాష సాహిత్యాలకి పరిమితమై ఉండాలి. అమెరికాలో తెలుగు సాహిత్య పోకడల మీద ప్రసంగాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. వాషింగ్టన్ DC పరిసర ప్రాంతాల (వర్జీనియా, మేరీలాండ్, పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ, న్యూయార్క్ మొదలైనవి) రచయితలకు, వక్తలకు తమ ప్రతిభా పాటవాలకు  జాతీయ స్థాయిలో గుర్తింపుకి   ఈ 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఒక అరుదైన అవకాశం.

ఈ సదస్సు నిర్వహించబడే వేదిక చిరునామా, ప్రతినిధుల నమోదు, ప్రవేశ రుసుము, వసతి సదుపాయాలూ మొదలైన వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ఈ లోగా సెప్టెంబర్ 23-24, 2017 తారీకులు ఈ 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు కేటాయించమని అమెరికా రచయితలను, సాహితీ వేత్తలను,భాషాభిమానులనీ కోరుతున్నాం.

వంగూరి చిట్టెన్ రాజు సంచాలకులు

Phone: 832 594 9054

E-mail: vangurifoundation@gmail.com

&

భాస్కర్ బొమ్మారెడ్డి  అధ్యక్షులు

Capitol Area Telugu Society

Phone: 516 491 2812