షారుఖ్‌, సల్మాన్‌ తో నేను ఎప్పుడూ పోటీ పడలేదు !

‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ అమిర్‌ ఖాన్‌… షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌తో తానెప్పుడూ పోటీ పడలేదని మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌ అన్నారు. చిత్రసీమలో ఇదివరకటిలా కాకుండా అగ్రతారలంతా స్నేహపూర్వక వాతావరణం కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరి సినిమా విడుదలైనప్పుడు మరొకరు ప్రశంసించడం, టీజర్‌ వస్తే.. దానిపై సోషల్‌ మీడియాలో సానుకూలంగా స్పందించడం వంటివి  జరుగుతోంది. ఇటీవల షారుఖ్‌ ఖాన్‌ సినిమా ‘జీరో’ టీజర్‌ విడుదలైన సందర్భం గా ‘షారుఖ్‌ మిమ్మల్ని మీరే అధిగమించేశారు”అని ట్వీట్‌ చేశారు అమిర్‌.  తాను అగ్రతారలతో ఎప్పుడూ పోటీ పడలేదని చెప్పారు. అమిర్‌ నటించిన తాజా చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’. యస్‌ రాజ్‌ ఫిల్మ్‌ బ్యానర్‌లో రూపొందింది. అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, ఫాతిమా ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది.   
మన దేశం నుంచి రోదసిలోకి వెళ్లిన మొదటి వ్యక్తి రాకేశ్‌ శర్మ జీవితం ఆధారంగా ‘సారే జహసే అచ్చా’ సినిమాలో అమిర్‌ ఖాన్‌ నటించాల్సి ఉంది. కానీ  ఆ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారు. ఆయన చేయాల్సిన పాత్రకు షారుఖ్‌ ఖాన్‌ అయితే సరిపోతారని అతని పేరు అమిరే సూచించారట. ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ‘మీరు ఎందుకు రాకేశ్‌ శర్మ బయోపిక్‌ నుంచి తప్పుకున్నార’న్న మాటకు ఆయన నవ్వుతూ బదులిస్తూ….”నేను ఆ ప్రాజెక్టు చేయడం లేదు కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. అదొక పెద్ద కథ. నాకు కొన్ని కమిట్‌మెంట్స్‌ ఉండడం వల్ల ఆ ప్రాజెక్టు చేయలేకపోయాను. అదొక అద్భుతమైన స్క్రిప్ట్‌. అదంటే నాకెంతో ప్రేమ. శర్మ కథ నిజంగా ఫ్యాషినేటింగ్‌. ఇది నిజం. ఆ కథను షారుఖ్‌ను   చేయమని నేను చెప్పా. ‘నువ్వు కచ్చితంగా ఈ స్క్రిప్ట్‌ వినాలి. ఇది అద్భుతమైన స్క్రిప్ట్‌. ఒక వేళ అతనికి ఆ కథ నచ్చితే దానికి అతనే తగిన నటుడు. షారుఖ్‌ ఆ కథను ఇష్టపడడం ఎంతో ఆనందంగా ఉంది” అని అన్నారు అమిర్‌ ఖాన్‌.
 

ఓస్టార్‌ ఇలా ఉండాలని ఆ రోజు రియలైజ్‌ అయ్యా !

‘ఉత్తమ చిత్రాల కోసం మీ మధ్య పోటీలో క్రమేణా మార్పులు వస్తున్నట్టు ఉన్నాయని విలేకరి అడిగిన ప్రశ్నకు అమిర్‌ సమాధానమిస్తూ…’కచ్చితంగా నేను పోటీ కాదు. షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌తో నేను ఎప్పుడూ పోటీ పడలేదు. ఇది మీరు నమ్మాలి. నేనొక స్టార్‌నని ఎప్పుడూ అనుకోను. కానీ షారుఖ్‌ ఖాన్‌ను  స్టార్‌  అనాలి. ఎందుకంటే అతను ప్రతి విషయంలోనూ రాణిస్తున్నాడు. మంచి అందగాడు, చార్మింగ్‌, మంచిగా దుస్తులు ధరిస్తారు. మావాళ్ళు తీవ్రంగా ఒత్తిడి తెస్తే ఈ రోజు ఇలా కుర్తా ధరించాను. లేకపోతే టీ షర్ట్‌ ట్రాక్‌ ఫ్యాంట్‌ వేసుకుంటాను అంతే. షారుఖ్‌ ఇంటికి వెళ్లినప్పుడు అతని దుస్తులు పెట్టే అల్మర చూశాను. అద్భుతం. నా ఇల్లు అంతా ఎంత ఉంటుందో అతని బట్టలు పెట్టుకునే అల్మర అంత ఉంటుంది. చాలా బాగా ఆర్గ్‌నైజ్‌ చేస్తున్నాడు. ఆ విషయం ఇంకా నాకు గుర్తుంది. ఓస్టార్‌ ఇలా ఉండాలని ఆ రోజు నేను రియలైజ్‌ అయ్యా” అని అన్నారు.