‘క్యాసెట్ కింగ్’ బయోపిక్ లో అమిర్‌ఖాన్

అమిర్‌ఖాన్ ఇప్పుడు సంగీత జగత్తులో అద్భుతాలు సృష్టించిన గుల్షన్ కుమార్ బయోపిక్ మీద దృష్టి సారించారట.బాలీవుడ్‌లో చాలాకాలంగా అమిర్‌ ఖాన్ వార్త ఒకటి చెక్కర్లు కొడుతోంది. ‘ధగ్స్ అఫ్ హిందుస్థాన్’ తరువాత అమిర్‌ఖాన్ భారీ ప్రాజక్టు ‘మహా భారత్’పై దృష్టి సారిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే అమిర్‌ఖాన్ ఈ సినిమాను ప్రస్తుతానికి వాయిదా వేశారని సమాచారం. అయితే దీనికన్నా ముందుగా మరో ప్రాజెక్టు మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమిర్‌ఖాన్ ఇప్పుడు సంగీత జగత్తులో అద్భుతాలు సృష్టించిన గుల్షన్ కుమార్ బయోపిక్ మీద దృష్టి సారించారట. నిర్మాత సుభాష్‌కపూర్, అమిర్‌ఖాన్‌లు నాలుగు వారాలుగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నారట. ‘టీసిరీస్’ తొలి యజమాని గుల్షన్ కుమార్ కుమారుడు భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ చిత్రం పేరు ‘మొఘల్’ అని నిర్ణయించినట్లు సమాచారం. ఈ బయోపిక్ ముందుగా హీరో అక్షయ్ కుమార్ దగ్గరకు వెళ్లగా, ఆయన తిరస్కరించడంతో… ఇప్పడు ఈ సినిమాలో అమిర్‌ఖాన్ నటించేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. కాగా గుల్షన్ కుమార్ నెలకొల్పిన ‘టీ సిరీస్’ క్యాసెట్లు ఒకప్పుడు విరివిగా అమ్ముడపోయేవి. అందుకే అతనికి ‘క్యాసెట్ కింగ్’ అనే పేరు వచ్చింది.