ప్రతి పాత్ర కోసం ఎంతో కష్టం !

ప్రతి పాత్ర కోసం ఎంతో కష్టపడే అమీర్ తన తాజా చిత్రం “థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్” కోసం కొత్త గెటప్ లోకి మారాడు. ముక్కు, చెవులు కుట్టించేసుకొని సరికొత్త లుక్ లో కనిపస్తున్నాడు. ప్రస్తుతం అమీర్ గెటప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటనకే సరికొత్త అర్దం చెప్పిన “మిస్టర్ పర్ ఫెక్ట్” ఇప్పటి వరకు విభిన్న పాత్రలలో నటించి మెప్పించాడు.అయితే అమీర్ తన చెవులు కుట్టించుకోవడంతో ఆ నొప్పి తట్టుకోలేక అల్లాడిపోయారట. సెట్‌లో ఎవరైనా ఆయన చెవిని కదిలిస్తే విలవిలలాడిపోయేవాడట. రాత్రిళ్లు పడుకునేప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోలేకపోతున్నారట.

మరి ఫ్యాన్స్ ని అలరించేందుకు ఈ సూపర్ స్టార్ చేసే సాహసాలను అభినందించకుండా ఉండలేము. ఈ మధ్య మహవీర్ ఫోగట్ జీవిత నేపథ్యంతో తెరకెక్కిన “దంగల్ “సినిమాలో కూడా తన బాడీలో వేరియేషన్ చూపించి అభిమానుల ఆనందాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళాడు ఆమీర్. అందులో ఇద్దరు కూతుళ్ళకి తండ్రిగా అమీర్ నటన అద్భుతం. “దంగల్” సినిమా ఇండియా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా చైనాలో చరిత్ర సృష్టిస్తుంది. “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా..” దంగల్ “భామ ఫాతిమా సనా ఖాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రినా కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం.