కొత్త తరహా కుటుంబ చిత్రం ‘అమ్మా నాన్న మధ్యలో మధురవాణి’

పానుగంటి మహంకాలమ్మ, యాదయ్య గౌడ్ సమర్పణలో మానస క్రియేషన్స్ పతాకంపై టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో బృందాకర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం “అమ్మ నాన్న మధ్యలో మధురవాణి”. ఈ చిత్రం 28న రామానాయుడు స్టూడియోలో  ప్రారంభమైంది. నూతన తారలు గౌతమ్ రాజ్ , సాయి విక్రాంత్  హీరోలుగా , మధుప్రియ, లావణ్య శర్మ, సిరి మరియు అంబిక హీరోయిన్స్ . పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బెక్కం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా..  ఫణి కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గౌరవ దర్శకత్వం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు చేశారు.. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో గౌతం రాజ్ ,మధుప్రియ ,సాయి విక్రాంత్ ,సిరివెన్నెల మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తుండగా.. నరేష్ వీకే, పవిత్ర లోకేష్, నందమూరి తారకరత్న, కెప్టెన్ చౌదరి, బేబీ శరణ్య, మాస్టర్ రాకేష్  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు

నరేష్ వీకే మాట్లాడుతూ.. దర్శకుడు ప్రసాద్ వర్మ ముందు నాకు టైటిల్ చాలా బాగా నచ్చింది.. దానికి ఎట్రాక్ట్ అయ్యాను.. అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.. ఇందులో నేను, పవిత్ర లోకేష్,తారక రత్న ముఖ్య పాత్రల్లో లో నటిస్తున్నాం. మంచి స్టార్ కాస్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ న్యూ జోనర్ లో వస్తున్న గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రిఫ్రెషింగ్ గా ఉంటుంది. బృందాకర్ గౌడ్ ప్రసాద్ వర్మను నమ్మి ఈ చిత్రం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఆయన మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

చిత్ర దర్శకుడు టిడి ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. నేను రాధాకృష్ణ అనే మూవీ ఫస్ట్ చేశాను. ఇది నా సెకండ్ ఫిల్మ్. నరేష్ గారి ఫ్యామిలీతో ఆరేళ్ళు అనుబంధం ఉంది. ఆ పరిచయంతో ఆయనకి ఈ కథ చెప్పాను. నరేష్ గారు ‘చాలా బాగుంది నేను చేస్తాను’ అని నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నిర్మాత బృందాకర్ గౌడ్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ అన్నారు.

నిర్మాత బృందాకర్ గౌడ్ మాట్లాడుతూ.. మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ప్రసాద్ వర్మ చెప్పిన స్టోరీ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. మా అబ్బాయి గౌతమ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు అందరూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ.. సపోర్ట్ చేస్తున్నారు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసే చిత్రం ఇది.. అన్నారు. ఈ చిత్రానికి  ఛాయాగ్రహణం: వాసు, ఎడిటింగ్: శివ శర్వాణి, మాటలు: కుమార్ మల్లారపు, ఉదయ్ శర్మ, నాగమణి రాజు, సాహిత్యం: మిట్టపల్లి సురేందర్.