బాయ్‌ఫ్రెండ్స్‌ తో తిరుగుతూ రూమర్స్ కు కారణం కావద్దు !

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ మొదటి భార్య అమృతాసింగ్ కుమార్తె  సారా అలీ ఖాన్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది.  చాలాకాలం సస్పెన్స్ కొనసాగిన తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘కేదార్‌నాథ్’ మూవీలో సారా నటిస్తున్న విషయం తెలిసిందే.  తొలుత తమ కూతురును ఇండస్ట్రీకి పరిచయం చేయడం లేదని చెప్పిన సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌లు ఆపై వారి నిర్ణయం మార్చుకున్నారు.అయితే పటౌడీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ యువరాణిగా పిలుపుచుకునే ఈ బ్యూటీకి ఆమె తల్లి అమృతాసింగ్ కొన్ని కండీషన్లు పెట్టారట….

సినిమా షూటింగ్‌ల పేరుతో హీరోలతో, బాయ్‌ఫ్రెండ్స్‌ తో  తిరగడం మాత్రం చేయవద్దని కూతురు సారాకు అమృత ఆంక్షలు విధించిందని ఇండస్ట్రీలో టాక్. పనిపై శ్రద్ధ పెట్టి కేవలం సినిమా విషయాలతోనే వార్తల్లో ఉండాలి తప్ప.. ఇతరత్రా పనుల వల్ల ఫొటోలు దిగుతూ, బయట తిరుగుతూ రూమర్స్ కు కారణం అవకూడదని హిత బోధ చేశారని సమాచారం. కూతురికి తొలి సినిమా కావడంతో టెన్షన్ పడుతున్న ఆమె తల్లి  అమృతాసింగ్  డైరెక్టర్ అభిషేక్ కపూర్‌ను కలిశారట. కూతురికి నటనలో కాస్త మెలకువలు నేర్పించాలని కోరారు. అయితే మూవీలో అసభ్యంగా మాత్రం చూపించవద్దని డైరెక్టర్‌కు అమృత విజ్ఞప్తి చేశారని ప్రచారం జరుగుతోంది.