అమీ ప్రేమాయణం జోరుగా సాగుతోంది !

టాప్ డైరెక్టర్ శంకర్-సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ‘2.0’ చిత్రం చేసిన హాట్ బ్యూటీ అమీజాక్సన్‌కు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ఈ భామ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉంది. అయితే షూటింగ్‌ల మధ్య దొరికిన కొద్దిపాటి విరామాన్ని ఆమె చక్కగా వినియోగించుకుంటోంది. ఆ సమయంలో ఈ అమ్మడు తన బాయ్‌ఫ్రెండ్‌తో షికార్లు చేస్తోందట. తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అమీ అందరు హీరోయిన్లలాగానే అతను తన ఫ్రెండ్ అని బుకాయించేస్తోంది….

అయితే ఈ భామ జార్జ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో పీకల్లోతు ప్రేమలో ఉందని సమాచారం. అంతేకాదు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట వారం రోజుల పాటు కెనడాలోని ఓ స్టార్ హోటల్‌లో హాయిగా ఎంజాయ్ చేసిందట. ఆ ప్రాంతంలోని మంచులో స్కీయింగ్ చేస్తున్న ఫొటోలను అమీ పోస్ట్ చేసింది. మొదట్లో అమీ, జార్జ్ ఫ్రెండ్స్ అనుకున్నారు. కానీ ఈ జంట పదే పదే చెట్టాపట్టాలేసుకొని షికార్లు కొడుతుండడంతో వారి మధ్య ప్రేమాయణం జోరుగా కొనసాగుతోందని తెలిసిపోయింది. వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్‌ను కూడా అమీ జార్జ్‌తోనే జరుపుకోవడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. ఇక బడా వ్యాపారవేత్త అయిన జార్జ్‌కు యూరప్‌లో చాలా హోటల్స్ కూడా ఉన్నాయట. మరి ఈ  జంట ప్రేమఎక్కడికి పోతుందో చూద్దాం….