బాలీవుడ్‌లో నాకు బాగా ప్లస్‌ అయ్యింది !

నాలుగువందల యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మక చిత్రం రోబో ‘2.0’లో నటిస్తున్నందుకు అమీజాక్సన్ ఎంతో సంతోషంగా ఉంది. సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘రోబో’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమీ హీరోయిన్.  లెజెండరీ యాక్టర్ రజనీతో కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో ఓ మైలురాయిగా పేర్కొంది ఈ హాట్‌బ్యూటీ.

అదేవిధంగా స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి రెండవ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండడం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది ఈ లండన్ సుందరి . ఇప్పటికే అమీ… శంకర్ దర్శకత్వంలో ‘ఐ’ సినిమా చేసింది. ఇక సినిమాలో విలన్‌గా చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించడాన్ని మరచిపోలేనని చెప్పింది అమీ జాక్సన్.  అక్షయ్ గురించి అమీ మాట్లాడుతూ… “బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరో అక్షయ్‌కుమార్. హిందీలో కూడా రిలీజయ్యే ఈ చిత్రానికి అక్షయ్ మూలంగా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. సౌత్ భాషలతో పాటు హిందీలో ఈ చిత్రం విడుదలకానుండడం నాకు బాగా ప్లస్‌ అయ్యింది”అని చెప్పింది.