దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్రాలను నమ్ముకుని చెన్నైలో సొంత నివాసం ఏర్పరచుకున్న ఎమీ “2.ఓ” చిత్ర విడుదల కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తోందట. ఎమీజాక్సన్ ఎందుకిలా చేసిందీ? అన్న ప్రచారం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోందిప్పుడు. ఇంతకీ ఈ ఇంగ్లీష్ అమ్మడు అంతగా చేసిన నేరమేమిటీ… “మదరాసుపట్టణం” చిత్రం నుంచి వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ మధ్యలో తెలుగు, హిందీ భాషల్లోనూ మెరిసిన ఎమీజాక్సన్ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా బ్రహ్మాండ చిత్రం “2.ఓ” చిత్రంలో నటిస్తోంది .
అయితే ఈ చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టి చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం అమ్మడికి చేతిలో ఒక్క ఆంగ్ల చిత్రం మినహా ఇతర భాషల్లో అవకాశాల్లేవు. ఈమె వివాదాస్పద సంస్థ ‘పెటా’కు ఇంకా తన మద్దతు తెలపడం, బాలీవుడ్ భామలకంటే ఎక్కువ ఫోజు ప్రదర్శించడంతో ఇక్కడ అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాత లు ముందుకు రావడం లేదని సమాచారం.
ఎమీజాక్సన్‌కు ఇలాంటి పరిస్థితుల్లో శాండిల్‌వుడ్ నుంచి పిలుపువచ్చింది. మోహన్‌లాల్ కథానాయకుడిగా నటిస్తున్న “ది విలన్” అనే చిత్రంలో ఒక పాత్ర చేయడానికి అంగీకరించింది. అందుకు చాలా తక్కువ పారితోషికం పుచ్చుకోవడానికి ఓకే అన్నదట. దీంతో ఆ పారితోషికానికి తాము కూడా అంగీకరించమని… అలాంటిది రజనీకాంత్ హీరోయిన్ ఎమీజాక్సన్ ఎలా అంగీకరించిందని చిన్నకారు హీరోయిన్లు సైతం ఆమె ఎందుకిలా చేసిందని చర్చించుకుంటున్నారట