కార్పొరేట్ సంస్థ కి షాకిచ్చింది !

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల’నే సామెతను అక్షరాలా పాటిస్తోంది ఎమీ జాక్సన్. సంపాదనలో చాలా ఫాస్టుగా మూవ్ అవుతోంది ఈ భామ. ఎమీ యాక్ట్ చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి శంకర్ తెరకెక్కిస్తున్న ‘2.0’ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయి స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరింది.    అదివరకు హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ ‘ఇంత కావాలి, అంత కావాలి’ అని డిమాండ్ చేసేవారు కాదు. మంచి సినిమాలో మంచి పాత్ర నటించాలని, తన నటనను అందరూ మెచ్చుకోవాలనీ కోరుకునేవారు. ఇప్పుడు చాలామంది నటీనటులు నటనకన్నా ముందు తమకింత ఇవ్వాలని, లేకపోతే చేయమని ఖరాకండీగా చెప్పేస్తున్నారు. సినిమాల్లో నటించడం పక్కన పెడితే ..కేవలం ఫోటో షూట్ చేయడానికిఎమీ జాక్సన్ ఎంత డిమాండ్ చేసిందో తెలిస్తే కళ్లు తిరుగుతాయి.

ఓ కార్పొరేట్ సంస్థ ఎమీ గ్లామర్ ని తన సంస్థకి ఉపయోగించుకోవాలని భావించింది. ఎమీ జాక్సన్ ను తమ ప్రోడక్ట్స్ కి ప్రచారకర్తగా తీసుకోవాలని ఓ కార్పొరేట్ సంస్థ భావించి ఆమెకి చెప్పడంతో ఆ అమ్మడు 3 కోట్లు డిమాండ్ చేసిందట. అందులో భాగంగా వాళ్లు ఆమెతో ఓ 6 గంటల పాటు ఫోటో షూట్ చేయించాలనుకున్నారు. కాని ఫోటో షూట్ కి ఎమీ జాక్సన్ ఎక్స్ ట్రాగా కోటి రూపాయలు అడిగిందట. ఆమె అలా అడిగేసరికి ఆ కంపెనీ నిర్వాహకులు బిత్తరపోయారట.