కాస్మోటిక్స్, బ్యూటీ సెలూన్ల బిజినెస్ లోకి …

 సినిమాల్లో నటించే అందాల భామలు తమ సంపాదనను ఎంతో జాగ్రత్తగా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ముద్దుగుమ్మలు ఇలా చేస్తారని వేరే చెప్పనవసరం లేదు. అయితే , పెట్టుబడి పెట్టే విషయంలో ఎవరి ఆలోచనలు వారివే. క్రేజీ సినిమాల్లో నటిస్తూ తన రేంజ్ పెంచుకుంటున్న అమీ జాక్సన్ అప్పుడే బిజినెస్ ఆలోచనల్లో మునిగిపోయిందట. యాడ్స్ కోసం తనపై ఆసక్తి చూపిస్తున్న వారికి చుక్కలు చూపిస్తోందట ఈ అందాల సుందరి.  మన దేశంలోని సినీ ప్రియులను మెప్పిస్తున్న ఈబ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ తన సంపాదనతో సొంతంగా కాస్మోటిక్స్ మేకింగ్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందట.
లండన్ లోని తన స్నేహితుడితో కలసి ఇందుకు సంబంధించిన ప్లానింగ్ లో ఉన్న అమీ కాస్మోటిక్స్‌తో పాటు బ్యూటీ సెలూన్లను కూడా ప్రారంభించాలని భావిస్తోందట. సినిమాల తరువాత ఏదో ఒక బిజినెస్ లోకి అడుగుపెట్టాలని భావించిన అమీ జాక్సన్ ముందుగానే కాస్మోటిక్స్ మేకింగ్ వ్యాపారంలోకి పెద్ద ఎత్తున అడుగుపెట్టాలని నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ‘2.ఓ’ వంటి క్రేజీ సినిమాలో నటిస్తున్న అమీ జాక్సన్ తనతో యాడ్స్ చేయాలని ఆసక్తి చూపిస్తున్న వారికి షాక్ ఇస్తోందట.
అమీ జాక్సన్‌ను తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించుకోవాలని భావించిన ఒక కార్పొరేట్ కంపెనీ నుంచి అమ్మడు ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసిందట. ఇందులో భాగంగా ఒక ఫోటో షూట్ చేయాలని కంపెనీ వాళ్లు కోరగా ‘అందుకు అదనంగా మరో కోటి ఇచ్చుకోండి’ అని అనేసిందట.  ఈ రేంజ్‌లో డబ్బు అడుగుతుండటంతో ఆమెతో డీల్ కుదుర్చుకోవాలా వద్దా? అని సదరు కంపెనీ డైలమాలో పడిపోయిందట. మొత్తానికి ఫ్యూచర్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉంది అమీ జాక్సన్.
నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా!
సాధారణంగా ఏ భాషలో చిత్రాలు చేస్తే ఆ భాషపై పట్టుంటే రాణించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆఫర్లు కూడా పెరిగేందుకు అవకాశాలు పుష్కలం. ఎమీ జాక్సన్‌కు కూడా బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని బలంగా ఉంది. కానీ హిందీ మీద పట్టులేకపోవడంతో అవకాశాలు తనదాకా రావడం లేదని ఆమె విశ్వాసం. అందుకే లక్నోలో ఉండే విక్రమ్‌ రాయ్ అనే హిందీ పండిట్‌ ద్వారా భాష నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని జాక్సన్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. ” రెండు వారాల క్రితం హిందీ నేర్చుకోవడం ప్రారంభించాను. ఇది నాకు కొత్త భాష. అనర్గళంగా మాట్లాడడానికి సమయం పడుతుంది. కష్టంగానే ఉంది. కానీ, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. కొన్ని నేషనల్‌ ప్రాజెక్టులు చేస్తుండడం వల్ల పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టలేకపోతున్నా. రెండు మూడు దేశాల్లో ఉండాల్సి వస్తుంది. కానీ ప్రస్తుత టెక్నాలజీ నేను నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది” అని పేర్కొంది.