అమైరా వదలనంటున్న ఆ హీరో ఇతనేనా ?

అమైరా దస్తూర్…”దక్షిణాదిన ఓ సినిమా చేస్తున్న సమయంలో హీరోతో పాట చేస్తున్నప్పుడు ఆ హీరో అనవసరంగా నా మీద చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడు”….అని సంచలన ఆరోపణలు చేసింది బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్. ఆమె చేసిన ఆరోపణలు తమిళ యువహీరో ధనుష్ గురించేనంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.  అమైరా ఇటీవల మాట్లాడుతూ.. ‘‘నాకు ఉత్తరాదిన, దక్షిణాదిన కూడా వేధింపులు ఎదురయ్యాయి. కాకపోతే ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిన ఎక్కువ వేధింపులకు గురయ్యాను. దక్షిణాదిన ఓ సినిమా చేస్తున్న సమయంలో హీరోతో పాట చేస్తున్నప్పుడు ఆ హీరో అనవసరంగా నా మీద చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడు. అదే విషయాన్ని డైరెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్ళాను. ఇక అప్పటి నుంచి నాకు నరకం చూపించారు. షూటింగ్‌కి ఉదయం ఎనిమిది గంటలకే రమ్మనేవారు. అప్పటినుంచీ రెడీ అయి కార్వాన్ లో కూర్చునేదాన్ని. ఎంత సేపైనా పిలిచేవారు కాదు. ఒక్కోసారి ఉదయం నుంచి కూర్చోబెట్టి సాయంత్రం ఓ ఐదు నిమిషాలు షూటింగ్‌ చేసేవారు. మరొకసారి ఉదయం నుంచి సాయంత్రం వరకూ వెయిట్‌ చేయించారు. ఓ రోజు నాకు షూటింగ్‌ లేదు. అయినా ఆ విషయం నాకు ముందు చెప్పలేదు. సాయంత్రం పేకప్‌ చెప్పే సమయానికి చెప్పారు.
దాంతో దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం మొదలైంది. ఈ విషయాలేవీ మా పేరెంట్స్‌కి నేను చెప్పలేదు.ఆ వ్యక్తికి దక్షిణాదిన మంచి పలుకుబడి ఉంది. ఓ పెద్ద హీరోకి అల్లుడు. అతడి పేరు చెబితే నా కెరీర్‌ని నాశనం చేసేస్తారు. అదే నా భయం. అందుకే అతని పేరు ఇప్పుడు చెప్పను. ఏదో ఒకరోజు అతగాడి పేరు బయటపెడతాను. దక్షిణాదిన నాకు సినిమా అవకాశాలు రాకపోయినా నేను బాధపడను. కానీ ఆ హీరోని మాత్రం వదలను’’ అని తెలిపింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అమైరా చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఆ హీరో ధనుషేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధనుష్‌తో కలిసి అమైరా ‘అనేగన్’ అనే చిత్రంలో నటించింది.సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అల్లుడు కూడా కావడంతో అతనే అనుకుంటున్నారు.