‘కొరమీను’ సినిమాను చూసిన ప్రేక్షకులే ప్రమోట్ చేస్తారు!

జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన  మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు … ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తోన్న‌ సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 31న సినిమా రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యాయి. కొరమీను’ చిత్రాన్ని  గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మ‌హేశ్వ‌ర్ రెడ్డి డిసెంబ‌ర్ 31న  రిలీజ్  చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా  కొర‌మీను టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.

ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాల‌కు సంబంధిచి కొర‌మీను, ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా టీమ్స్ క‌లిసి ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకొచ్చారు. ఒక‌రోజు ముందుగా వ‌స్తున్న ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్ మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన త‌మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  కొర‌మీను టీమ్‌ను ఆహ్వానించగా.. హీరో ఆనంద్ ర‌వి, హీరోయిన్ కిశోరి వెళ్లి టీమ్‌కు విషెష్ తెలియ‌జేశారు. అలాగే బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్‌ని కొర‌మీను టీమ్ ఆహ్వానించగా.. సోహైల్‌, హీరోయిన్ మోక్ష హాజ‌రై త‌మ విషెష్‌ను అందించారు. ఇలా ఒక‌రికొక‌రు స‌పోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే స‌రికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం ప‌లికాయి. దీన్ని ఇలాగే అంద‌రూ కొన‌సాగిస్తే బావుంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

నిర్మాత సమన్య రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా బాగా వచ్చింది.  డిసెంబర్ 31న రాబోతోంది. మీడియా పిలిస్తే జనాలు కచ్చితంగా థియేటర్‌కు వస్తారు. లక్కీ లక్ష్మణ్ కథ వేరేగా ఉంటుందని, ఆ లక్ మాకు కూడా రావాలని, కొరమీను కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్ శ్రీపతి మాట్లాడుతూ.. ‘ఒక డైరెక్టర్‌లా కాకుండా.. నేను ఓ ప్రేక్షకుడిలా చెబుతున్నా. రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో కచ్చితంగా ప్రేక్షకులే సినిమాను ప్రమోట్ చేస్తారు’ అని అన్నారు.

ఆనంద్ రవి మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేసిన లక్కీ లక్ష్మణ్ టీంకు థాంక్స్. డిసెంబర్ 30న లక్కీ లక్ష్మణ్ వస్తోంది. డిసెంబర్ 31న మా కొరమీను రాబోతోంది. మందుబాబుల దినోత్సవం నాడు మా సినిమా రాబోతోంది. సినిమాను చూసిన ఏ ఒక్కరూ నిరాశచెందరు ‘ అని అన్నారు.

హీరోయిన్ కిషోరి మాట్లాడుతూ.. ‘కొరమీనులో మీనాక్షి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఇంత మంచి పాత్రను రాసిన రవి గారికి థాంక్స్’ అని అన్నారు.

లక్కీ లక్ష్మణ్ డైరెక్టర్ అభి మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడకు రావడానికి కారణం రవి అన్న. నేను కాలేజ్‌లో ఉన్న సమయంలో ప్రతినిధి సినిమాను చూశాను. నెపోలియన్‌ తరువాత రవి అన్నను చూశాను. ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నాను. ఈ రోజు ఇలా స్టేజ్‌ మీద ఆయన పక్కన ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

లక్కీ లక్ష్మణ్ నిర్మాత హరిత మాట్లాడుతూ.. ‘మనిషికి ఉండే ఇగో అనే క్వాలిటీ మీద సినిమాను తీస్తున్నారు కాబట్టి అందరికీ రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. మా రెండు సినిమాలు  పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సోహైల్ మాట్లాడుతూ.. ‘క్రాస్ ప్రమోషన్స్ అంటేనే నాకు చాలా ఇష్టం. పెద్ద సినిమాల విషయంలో ఓపెనింగ్స్ వస్తాయి. కానీ చిన్న సినిమాలకు టాక్ వస్తేనే కలెక్షన్లు వస్తుంటాయి. ఓపెనింగ్స్ ఉండవు.  కొరమీను లాంటి సినిమా నాకు చేయాలని ఉంది. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. నాకు చాలా నచ్చింది. డిసెంబర్ 30, 31 కథ వేరే ఉంటది’ అని అన్నారు.

రైటర్ లక్ష్మీ భూపాల మాట్లాడుతూ.. ‘ప్రతినిధి సినిమా నేను రాసి.. రవి డైరెక్టర్ చేయాల్సింది. కానీ రవి రాసి.. వేరే వారితో డైరెక్ట్ చేయించాడు. నేను రాసి ఉంటే అంత బాగా వచ్చి ఉండేది కాదేమో. లెక్కలేసుకుని ఏమీ చేయడు. సహజంగా నటిస్తాడు. కిషోరి పేరు చాలా కొత్తగా ఉంది. ఆకాశం నీహద్దురా అపర్ణా బాలమురళి, ఐశ్వర్యా రాజేష్‌లు వావ్ అనేలా ఉండరు.. కానీ వారి పర్ఫామెన్స్ అద్బుతంగా ఉంటుంది. అలానే కిషోరి కూడా అనిపిస్తుంది. డైరెక్టర్ శ్రీపతి కర్రి పెద్ద హిట్ కొట్టాలి’ అని అన్నారు.