నలుగురు స్నేహితుల ప్రేమకథ ‘2 ఫ్రెండ్స్‌’

సూరజ్‌, రవీంద్ర, తేజ, సోనియా హీరో హీరోయిన్లుగా జి.ఎల్‌.బి.శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘2ఫ్రెండ్స్‌’ చిత్రం ప్రారంభమైంది. ముళ్ళగూరు లక్ష్మీ దేవి సమర్పణలో అనంత లక్ష్మి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముళ్ళగూరు అనంత రాముడు, మళ్ళగూరు రమేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైన తొలి సన్నివేశానికి ఎమ్మెల్యే గాంధీ క్లాప్‌ కొట్టగా, విజరు చందర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఓం సాయిప్రకాష్‌ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. జి.ఎల్‌.బి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ… మంచి కథను తయారు చేసుకోవడానికి ఏడాది పట్టింది. పాటల రికార్డింగ్‌ పూర్తయ్యాయి. యువతకు సంబంధించిన మంచి కథ. అందరికీ నచ్చే చిత్రంగా తెరకెక్కిస్తామని అన్నారు. నిర్మాత ముళ్ళగూరు అనంత రాముడు మాట్లాడుతూ ‘రైతుగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాను. ఇంజనీరింగ్‌ కాలేజీలను స్థాపించి విద్యను అందిస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని పనులు విజయవంతమయ్యాయి. తొలిసారి సినిమా ఇండిస్టీలోకి అడుగుపెట్టాను. ఇక్కడ కూడా విజయం సాదిస్తాననే ధీమా ఉంది. ఘటికాచలం మంచి కథను అందించారు. ప్రేమ, స్నేహంపై సబ్జెక్ట్‌ ఇది’ని అన్నారు.