ఆఖరికి ‘ఫైటర్‌’ విజయ్ జంటగా అనన్య!

‘ఫైటర్‌’ లో చివరికి అనన్య పాండేను ఎంపిక చేసినట్టు తెలిసింది. అనన్య ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె. విజయ్ దేవరకొండ కు జోడీగా చేయబోతుంది. విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ‘ఫైటర్‌’. ఈ చిత్రం కథానాయిక అన్వేషణలో చివరికి అనన్య పాండేను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈమె ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె. విజయ్ కు జోడీగా ఈమె చేయబోతుంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. ‘ఫైటర్‌’ కోసం ముందుగా శ్రీదేవి తనయ జాన్వి కపూర్‌ను సంప్రదించారు. ఇంతకు ముందే ఆమె అంగీకరించిన సినిమాల వల్ల డేట్స్‌ అడ్జిస్ట్‌ చేయలేకపోయింది. తర్వాత కియరా అద్వానితో నటింపజేయాలని చూశారు. ఆమె పరిస్థితీ అంతే. ఈ సినిమాలో కరణ్‌ జోహార్‌ కూడా భాగస్వామి కావడంతో… ఆయనే అనన్య పాండే పేరును సూచించారట. అనన్య ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ అనే బాలీవుడ్‌ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ‘పతి పత్ని ఔ ఓ’ లో కూడా నటించింది.
 
‘ఫైటర్‌’ చిత్రం సోమవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టారు. ముంబాయిలో తొలి షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. ఇది 15 రోజులు పాటు ఉండనుంది. రెండో షెడ్యూల్‌ నుంచి అనన్య పాండే చిత్రీకరణలో పాల్గొననుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందనుంది. అందుకే విజయ్ దేవరకొండ థాయ్ లాండ్‌లో మిక్సిడ్‌ మార్సల్‌ ఆర్ట్స్‌ శిక్షణ పొందుతున్నాడు.ఇప్పటి దాకా తను చేసిన పాత్రల్లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ మూవీలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు.‘పాన్ ఇండియా మూవీ’గా ఈ చిత్రం హిందీతో పాటు, అన్ని దక్షిణాది భాషల్లోనూ ఇది రూపొందుతోంది.