అనసూయ ప్రధాన పాత్రలో ఫిక్షన్, యాక్షన్ ‘దర్జా’ ఫస్ట్ లుక్ !

సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణ. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌. సలీమ్ మాలిక్ దర్శకత్వం. శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాత కేఎల్ నారాయణ  ఆవిష్కరించారు… “ఈ ఫస్ట్ లుక్ కూడా ‘దర్జా’గా ఉందని, ఈ సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని.. చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు కేఎల్ నారాయణ. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, కెఎల్ నారాయణ, సునీల్, అనసూయ, పృథ్వీ, షకలక శంకర్‌‌తో పాటు చిత్రయూనిట్ పాల్గొంది.

‘‘ సినిమా చాలా బాగా వస్తోంది. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నం లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేశాం. కామినేని శ్రీనివాస్‌గారి సపోర్ట్ మరిచిపోలేనిది. సునీల్‌గారు, అనసూయగారు, ఇతర నటీనటులు ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నారు. అనసూయగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం..’’ అని తెలిపారు దర్శకనిర్మాతలు.
సునీల్, అనసూయ, ఆమని, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ ,శిరీష, షకలక శంకర్,  మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్ ,రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి…కథ: నజీర్, మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్,కెమెరా: దర్శన్,
సంగీతం: రాప్ రాక్ షకీల్, ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ.