‘డోంట్‌కేర్’ నటి ఇప్పుడు బోల్డ్ గా చెయ్యనంటోంది !

అండ్రియా …ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రొమాన్స్‌ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయినా ‘డోంట్‌కేర్’… వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు బదులివ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగానే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. సంచలన తారల్లో నటి అండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చిన పనిచేయడానికి ఏమాత్రం వెనుకాడని నటి ఈమె.  నటిగానే కాకుండా మంచి గాయని కూడా అయిన ఆండ్రియా ఏ తరహా పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటిస్తుంది. అలా వేశ్య పాత్రలో నటించడానికీ వెనుకాడలేదు. ఆండ్రియా పలు సినిమాల్లో హాట్‌గా  బోల్డ్ సన్నివేశాల్లో నటించి యువకులను మురిపించింది. ఇంతకుముందు గ్లామరస్‌ పాత్రల్లోనూ నటించిన ఆండ్రియా సిద్ధార్థ్ సినిమా ‘గృహం’లో హద్దులు మీరి అందాలొలికించింది. ‘తరమణి’ లాంటి చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఇక ఇటీవల విడుదలైన ‘విశ్వరూపం–2’ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించి శభాష్‌ అనిపించుకుంది.
అయితే ఎందుకో ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మనసు మార్చుకుందట. ఇకనుంచి బోల్డ్ క్యారెక్టర్స్ చేయనంటోంది. హుందాగా ఉండే పాత్రల కోసమే దర్శకులు, నిర్మాతలు తనను సంప్రదించాలని సంకేతాలు పంపిస్తోందట. ప్రస్తుతం ధనుష్‌తో నటిస్తున్న ‘వడ చెన్నై’ చిత్రంలోనూ చాలా వైవిధ్యభరతమైన పాత్రలో కనిపించనుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉంది. దీంతో తన పంథాను మార్చుకుందట. చాలా సెలెక్టెడ్‌ చిత్రాలే చేస్తున్న ఈ భామ ఇకపై గ్లామర్‌ పాత్రల్లో నటించరాదన్న నిర్ణయం తీసుకుందట. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే అంగీకరించనున్నట్లు పేర్కొంది. ఇకపైనటిగా ఇమేజ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నట్లు చెప్పింది. కాబట్టి ఇమేజ్‌కి భంగం కలిగించే ‘లిప్‌లాక్’, ‘హీరోలతో సన్నిహితంగా నటించడం’, ‘హద్దులు మీరిన గ్లామర్‌ పాత్రల్లో నటించడం’ …వంటి విషయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.ఆ విషయం దర్శక నిర్మాతలకు కథ వినే ముందే చెప్పేస్తోందట. “ఇప్పటి వరకూ అండ్రియా వేరు ఇకపై వేరు” అని ఈ సంచలన నటి అంటోంది.  ప్రస్తుతం అండ్రియా చేతిలో ‘వడచెన్నై’,’కా’ అనే రెండు చిత్రాలే ఉన్నాయి. ‘విశ్వరూపం 2’లో ఆమె యాక్షన్ సీన్లను చూసిన పలువురు నిర్మాతలు ఆండ్రియాతో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించాలని అనుకుంటున్నారట.