సంక్రాంతికి పెద్ద పండగలాంటి సినిమా!

మహేష్‌బాబుతో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై.. దిల్‌రాజు సమర్పణలో.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో.. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలకాబోతున్న సందర్భంగా నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ ..
 
”సరిలేరు నీకెవ్వరు’ అందరూ గర్వపడేలా వచ్చింది. 140 రోజులు ఎలాంటి అవాంతర పరిస్థితులు లేకుండాషూటింగ్ పూర్తి అయ్యింది.మహేష్‌ని ఫ్యాన్స్‌ ..యూత్‌.. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో సినిమా అలా ఉంటుంది. మహేష్‌ కెరీర్‌లో ‘వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ’ అవుతుంది. 13 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర లో ‘అవార్డు విన్నింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌’ ఇచ్చారు. అనీల్‌ రావిపూడి అనగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ గుర్తుకొస్తుంది. అనుకున్నదానికంటే ఎక్కువ ఫన్‌ ఉంటుంది. ఈ సంక్రాంతికి పెద్ద పండగలాంటి సినిమా. మా హీరో నుండి ఇంతవరకు ఇలాంటి ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చి ఉండదు” అని అన్నారు
 
మహేష్‌, విజయశాంతి కాంబినేషన్‌
ఆ కాంబినేషనే పెద్ద సెల్లింగ్‌ ఫ్యాక్టర్‌. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్‌కి ప్రేక్షకుల నుండి విజిల్స్‌, క్లాప్స్‌ పడుతూనే ఉంటాయి. అవి లేనిచోట కన్నీళ్ళు పెడతారు. సినిమా అంతా కూడా నవ్వుతూ, క్లాప్స్‌ కొడుతూ ఉంటారు. ఒక సందర్భంలో ఎమోషనల్‌ అవుతారు.
 
‘సరిలేరు నీకెవ్వరు’టైటిల్‌ జస్టిఫికేషన్‌
‘సరిలేరు నీకెవ్వరు’ అనేది ‘ట్రిబ్యూట్‌ టు ఇండియన్‌ సోల్జర్స్‌’. ఈ సినిమాలో హీరో కూడా సోల్జర్‌. ‘సరిలేరు నీకెవ్వరు’ అనేది ఏ వ్యక్తి గురించి కాదు… ఇండియన్‌ ఆర్మీ గురించి. సోల్జర్స్‌, తమ కుటుంబ సభ్యుడ్ని దేశానికి కాపలా పెట్టే వారి పేరెంట్స్‌ను ‘సరిలేరు మీకెవ్వరు’ అని చెప్పే సినిమా. ఈ సినిమాతో సోల్జర్స్‌కి మరింత గౌరవం పెరుగుతుంది. ఆర్మీ మేజర్‌ రాయలసీమకి వస్తాడనేది అందరికీ తెల్సిందే. వచ్చి ఏం చేశాడనేది ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలో ఇంతవరకూ రాని యూనిక్‌ పాయింట్‌.
ఆర్మీ ఎపిసోడ్‌ ఎంతసేపు..
ఈ సినిమాలో మహేష్‌ ఆర్మీ మేజర్‌గా చేస్తున్న విషయం తెల్సిందే. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుండి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు ఆర్మీ మేజర్‌ అనేది అందరికీ గుర్తుండిపోతుంది.
 
ట్రెయిన్‌ ఎపిసోడ్‌ గురించి..
సినిమాలో అది బెస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ ఎపిసోడ్‌. ఫస్టాఫ్‌లో దాదాపు 30 నిమిషాలు ఉంటుంది. రేపు థియేటర్‌లో ఆ ఎపిసోడ్‌కి ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు.
 
కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్‌
కథలో భాగంగానే ఆ సెట్‌ వేశాం. ఆర్మీ నుండి రాయలసీమకు వస్తారు. రాయలసీమలో కర్నూల్‌ కంటే బెటర్‌ బ్యాక్‌డ్రాప్‌ రాదని కొండారెడ్డి బురుజు సెట్‌ వేయడం జరిగింది.
 
దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌
దేవి మ్యూజిక్‌ కస్టమ్‌ టైలర్‌మేడ్‌ ఫర్‌ ది హీరో. వినేటప్పుడు కన్నా విజువల్‌గా చూస్తున్నప్పుడు ఇంకా బాగుంటుంది. ఏ సాంగ్‌ చూసినా వేరెవరికీ సెట్‌ అవ్వదు అనేవిధంగా మ్యూజిక్‌ ఉంది. రీరికార్డింగ్‌ కూడా టాప్‌లో ఉంటుంది.
 
మిగతా క్యారెక్టర్స్‌ గురించి..
రాజేంద్రప్రసాద్‌గారు సినిమా అంతా హీరోతోనే ఉంటారు. అలాగే బండ్ల గణేష్‌ క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది.
 
సినిమా చూశాక ఎలా అన్పించింది?
నేను నిన్ననే సినిమా చూశాను. బయటికి వచ్చాక చాలా గర్వంగా అన్పించింది. ఇంతవరకూ అనీల్‌ రావిపూడిని ఒక యాంగిల్‌లో చూశారు. ఈ సినిమా విడుదలయ్యాక కంప్లీట్‌గా వేరే లీగ్‌లోకి వెళతారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ వదలకుండా మహేష్‌లాంటి హీరో ఉన్నప్పుడు ఏమేం చేయగలడో అన్నీ చేశారు.
 
ప్రీ రిలీజ్‌కి ‘మెగాస్టార్‌’ ముఖ్య అతిథి
వాళ్ళిద్దరి రేంజ్‌కి తగ్గట్లుగానే సెక్యూరిటీ ఉంటుంది. ‘మెగాస్టార్‌’ మా అతిథిగా రాబోతున్నారు. అలాగే ‘సూపర్‌స్టార్‌’ మహేష్‌ ఆ ఈవెంట్‌ని హోస్ట్‌ చేస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ ఇది జరగలేదు. అందుకే జ‌న‌వ‌రి 5న జ‌రిగే ఈవెంట్‌కి ‘మెగా సూపర్‌ ఈవెంట్‌’ అని పేరు పెట్టాం.