యానిమేటెడ్ ఫిలిమ్ `ది స్టోలెన్ ప్రిన్సెస్‌` 24న

మ్యాజిక‌ల్‌, అడ్వేంచ‌ర‌స్‌, ఫ్యామిలీ సెంట్రిక్ మూవీగా తెర‌కెక్కిన యానిమేటెడ్ ఫిలిమ్ `ది స్టోలెన్ ప్రిన్సెస్‌`. ఈ ఆగ‌స్ట్ 24న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ, ఆంగ్ల భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.ప్రేక్ష‌కుల‌ను అబ్బుర ప‌రిచే విన్యాసాలు.. థ్రిల్ చేసే యాక్ష‌న్స్, ఆశ్చర్యానికి గురిచేసే మాయ‌లు.. మంత్రాలు ఇవ‌న్నీ సోషియో ఫాంట‌సీ చిత్రాల్లో కామ‌న్‌గా ఉండే అంశాలే. ఇలాంటి ఎలిమెంట్స్ ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రం`ది స్టోలెన్ ప్రిన్సెస్‌`.
 
భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ త్రీడీ యానిమేటెడ్ మూవీలో థ్రిల్ చేసే కాన్సెప్ట్ అందులోని స‌బ్ ప్లాట్స్‌తో పాటు బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ కూడా ఉంది. ర‌స్‌లాన్.. మిలాను ప్రేమిస్తాడు. ఆమె దేశపు యువ‌రాణి అని ర‌స్‌లాన్‌కు తెలియ‌దు. అయితే ఓ కార‌ణంతో యువ‌రాణి మిలాను .. దుష్ట మాంత్రికుడు కోర్‌నోమోర్ కిడ్నాప్ చేస్తాడు. ర‌స్లాన్ త‌న ప్రేయ‌సిని ఎలా కాపాడుకున్నాడు.. ఈ కాపాడే క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న ప‌రిస్థితులేంటి? ర‌స్‌లాన్‌కు యువ‌రాణిని కాపాడ‌టానికి ఎవ‌రెవ‌రు స‌హాయం చేశారు. అనే విష‌యాల‌ను అద్భుత‌మైన స్క్రీన్‌ప్లేతోరూపొందించారు. చెడుపై ఎప్పుడూ మంచే జ‌యిస్తుంద‌నే కాన్సెప్ట్‌తోనే ద‌ర్శ‌కుడు ఒలెగ్ మాల‌ముహ్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. యారోస్లావ్ వ్యోతెషేక్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. ముఖ్యంగా యానిమేష‌న్ చిత్రాల‌ను వీక్షించ‌డానికి ఎక్కువ మంది పిల్ల‌లు ఆస‌క్తి చూపుతుంటారు. చిన్న పిల్ల‌ల‌కు న‌చ్చిన యానిమేష‌న్స్‌ను క్రేజ్ ఉంటుంది. ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌క్సెస్ అయిన యానిమేష‌న్ చిత్రాల‌న్నీ పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకున్నవే. కాబ‌ట్టి పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్‌తో ఈ యానియేష‌న్ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత‌లు అలాగే.. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ స‌మాహారంగా సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా తెర‌కెక్కించారు.
‘The Stolen Princess’ release on August 24
‘The Stolen Princess’ is a magical, adventurous family-centric animation film set to release on 24th August, 2018 in English, Hindi, Tamil and Telugu languages across India.
 
We are pleased to tell you all that ‘The Stolen Princess’ is an engaging fairy tale involving captivating adventures, fascinating original characters and interesting subplots. The main theme of the film is the triumph of Good over Evil and a charming love story entwined in it.
 
The film is designed to pique the interest of children, teenagers and youth. The multifaceted quality of the story and its arresting visuals makes it an interesting family watch. The film is presented and distributed by Ultra Media and Entertainment Group. It has been scripted by Yaroslav Voytseshek.
 
Story synopsis
Directed by Oleg Malamuzh, this wonderful story takes place in the era of valiant knights, beautiful princesses, and battling sorcerers.
 
Ruslan, a wandering artist dreaming to become a knight, meets beautiful Mila and falls in love with her, he doesn’t even suspect that she is the King’s daughter. However, the lover’s happiness doesn’t last too long.
 
Chоrnomor, an evil sorcerer, appears in a magical vortex and stoles Mila right in front of Ruslan’s eyes to transform her power of love into his own magical power. Spontaneously, Ruslan now sets out on a chase after the stolen princess to overcome all obstacles and to prove that real love is stronger than magic.