అంజ‌లి `తారామ‌ణి` టీజ‌ర్స్‌ విడుద‌ల

అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `తారామ‌ణి`. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నియశ్వంత్ మూవీస్ స‌మర్ప‌ణ‌లో డి.వి.సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వెంక‌టేష్ తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రెండు టీజ‌ర్స్‌ను   ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లోవిడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా…
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – “చిన్న సినిమాలు, చిన్న నిర్మాత‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ముందుండే వారిలో మారుతిగారు ఒక‌రు. ఆయ‌న తారామ‌ణికి త‌న స‌పోర్ట్ అందించ‌డానికి ముందుకు రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాత డి.వెంక‌టేష్‌గారు ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా అందంగా మ‌లిచారు. డిఫ‌రెంట్ పాయింట్‌తో తెరకెక్కిన ఈసినిమా టీజ‌ర్ చాలా ట్రెండీగా అనిపిస్తుంది. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
మారుతి మాట్లాడుతూ – “మంచి సినిమా, మ‌హానుభావుడు రీ రికార్డింగ్ స‌మ‌యంలో సినిమాను చూశాను. చాలా బాగా న‌చ్చింది. ఇప్పుడు సోసైటీ జ‌రుగుతున్న సిచ్యువేష‌న్స్‌ను బేస్ చేసుకుని స్ట్రాంగ్ కంటెంట్‌తో సినిమాను ద‌ర్శ‌కుడు రామ్ తెర‌కెక్కించారు. ద‌ర్శ‌కుడు తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని స్ట్ర‌యిట్‌గా చెప్పారు. డి.వెంక‌టేష్‌గారు ఓ స్ట్ర‌యిట్ సినిమా త‌ర‌హాలో సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.
ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ – “సినిమా సూప‌ర్‌హిట్ అయ్యి, నిర్మాత‌కు సంతోషం క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
నిర్మాత డి.వెంక‌టేష్ మాట్లాడుతూ – “త‌మిళంలో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అదే త‌ర‌హాలో తెలుగులో పెద్ద ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన మారుతిగారు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌తి కుటుంబాన్ని డిస్ట్ర‌బ్ చేయ‌డానికి ఎవ‌డో ఒక‌డు వ‌స్తుంటాడు. అలాంటివేమీ లేకుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నేదే ఈ సినిమా. క‌చ్చితంగా అంద‌రిలో అవేర్‌నెస్ క‌లిగించే సినిమా. సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని నాకు పెద్ద న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.