ఇషాన్ ‘అంతం కాదిది ఆరంభం’ మోషన్ పోస్టర్ విడుదల !

పవర్ ఫుల్ టైటిల్‌తో క్రసెంట్ సినిమాస్, కృష్ణ ప్రొడక్షన్స్ నిర్మాణంలో  కొత్త దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. ఈ చిత్రాన్ని ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు దశరథ్ ఆవిష్కరించి.. చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.

దశరథ్ మాట్లాడుతూ.. ‘తమిళ నాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అమ్మాయిలను ట్రాప్ చేసి… వాళ్ల నగ్న వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వ్యక్తిని  ఎలా పట్టుకున్నారు అనేదే ఈ చిత్రం కథ. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కరెంట్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు. సిరాజ్ తో చాలా కాలం నుంచి పరిచయం వుంది. టైటిల్ బాగుంది. చిత్ర టీమ్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాత సిరాజ్ మాట్లాడుతూ… సూపర్ స్టార్ కృష్ణ గారి మీద అభిమానంతో మా సినిమాకి ఈ టైటిల్ పెట్టాం. ఎక్కడా రాజీలేకుండా సినిమాని తీశాం. మహిళపై అత్యాచారాలకి పాల్పడే వారికి ఈ చిత్రం ఓ మేసేజ్ ఇస్తుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా హీరో, దర్శకుడు ఇషాన్ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల, హీరోయిన్స్ శక్తి మహీంద్రా, నిష్మా, షేర్ స్టూడియో అధినేత దేవీ ప్రసాద్, గీతా సింగ్, ఖాదర్ గోరీ, వైష్ణవి, నాగ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ  చిత్రానికి  కెమెరా: టి. శ్రీనివాసరావు, డైలాగ్స్: రాజేంద్ర, భరద్వాజ్, ఎడిటర్: నాగిరెడ్డి, సంగీతం: వినోద్ యాజమాన్య