పిక్‌పాకెటింగ్ చెయ్యడం నేర్చుకున్నా !

ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళం అంటూ అన్ని భాషల్లోనూ నటిస్తున్న నటి అనుఇమ్మానుయేల్‌. కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రం ‘తుప్పరివాలన్‌’. విశాల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్‌ దర్శకుడు. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి అనుఆమ్మానుయేల్‌ తెలుపుతూ… దొంగతనం ఎలా చేయాలో నేర్చుకున్నానని నటి అనుఇమ్మానుయేల్‌ చెప్పింది.మిష్కిన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పగానే పలువురు పలు రాకాలుగా మాట్లాడారన్నారు. ఆయన ‘షార్ట్‌టెంపర్‌’ అంటూ భయపెట్టారు కూడా అని అంది. అయితే మిష్కిన్‌ దర్శకత్వంలో నటిస్తున్నప్పుడు ఆయన గురించి అందరూ ఎందుకలా అనుకుంటున్నారో తనకు మాత్రం అర్థం కాలేదన్నారు.

మిష్కన్‌ దర్శక శైలి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పింది. ‘తుప్పరివాలన్‌’ చిత్రంలో నటించడానికి ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా రమ్మని తనకు మిష్కిన్‌ చెప్పారని అంది. తనను చిత్రంలోని నాయకిగా ఎలా మలుచుకోవాలో ఆయనకు బాగా తెలుసంది. తానూ అదే కోరుకోవడంతో మిష్కిన్‌ చెప్పినట్లు నటించానని తెలిపింది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానంది. ఇందులో తాను పిక్‌పాకెటర్‌గా నటించానని, అందుకు దొంగతనం ఎలా చేయాలన్నది కూడా నేర్చుకున్నానని చెప్పింది. ఇక చిత్ర హీరో విశాల్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. ఆయన చాలా కూల్‌ పర్సన్‌ అని, నడిగర్‌సంఘం, నిర్మాతల మండలికి సంబంధించిన చాలా ఇష్యూస్‌ ఉన్నా సెట్‌లో ఎలాంటి టెన్సన్‌ పడరని అంది.