ప్రస్తుతం టాలీవుడ్‌లో కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నా !

“మనల్ని ఆప్యాయంగా చూసుకునేవారు పక్కనుంటే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ప్రస్తుతం నేను టాలీవుడ్‌లో కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నాను’’ అని అంటోంది అనుపమ.‘అ..ఆ’, ‘ప్రేమమ్‌’, ‘శతమానం భవతి’ చిత్రాలతో ఆకట్టుకున్నారు అనుపమా పరమేశ్వరన్‌. తొలి సినిమాకే ఆమె తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. ప్రస్తుతం తెలుగులో ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్‌ గురించి అనుపమ మాట్లాడుతూ ‘‘తెలుగులో సౌండ్స్‌ వింటున్నప్పుడు నా మాతృభాష అయిన మలయాళానికి కాస్త దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. భాషతో సమస్య ఉండదని తెలిసినప్పుడు ముఖ కవళికలు నిర్మలంగా ఉంటాయి. నటనలో స్పష్టత వచ్చేస్తుంది. ‘అ..ఆ’లో నన్ను చూసిన వారందరికీ ఆ విషయం అర్థమవుతుంది. దానికి తోడు పరిసరాలు అనుకూలంగా ఉంటే మనిషికి బెరుకు ఉండదు.

త్రివిక్రమ్‌గారు తొలిసారి నన్ను చెన్నైలో కలిసినప్పుడు ఆయన పద్ధతి నచ్చింది. మాట్లాడేతీరు నచ్చింది. ఆయనతో పనిచేసే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకూడదనిపించింది. తీరా టాలీవుడ్‌కి అడుగుపెట్టాక ఇక్కడ హీరోయిన్స్‌ని అందరూ ఎంత ప్రేమగా చూసుకుంటారో అర్థమైంది. మనల్ని ఆప్యాయంగా చూసుకునేవారు పక్కనుంటే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ప్రస్తుతం నేను టాలీవుడ్‌లో కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నాను’’ అని చెప్పారు అనుపమ.