నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘రాజరథం’. ఇదే కాంబినేషన్‌లో రూపొందిన ‘రంగితరంగ’ కన్నడలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. యు.ఎస్.లో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. అక్కడ 300 సెంటర్స్‌లో రన్ అవ్వడమే కాకుండా కొన్ని చోట్ల 50 రోజులు ప్రదర్శింపబడడం విశేషం. యు.కె.లో కూడా ‘రంగితరంగ’ సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పుడు ఓ విభిన్న కథాంశంతో రూపొందుతున్న ‘రాజరథం’ చిత్రంతో హీరో నిరూప్ భండారి, హీరోయిన్ అవంతిక శెట్టి, దర్శకుడు అనూప్ భండారి తెలుగులో పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్ 26న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన దగ్గుబాటి రానా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో నిరూప్ భండారి, హీరోయిన్ అవంతిక శెట్టి, దర్శకుడు అనూప్ భండారి, రామజోగయ్యశాస్త్రి, అబ్బూరి రవి, నిర్మాతల్లో ఒకరైన సతీష్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ – ”సినిమా దర్శకుడు అనూప్ భండారి గురించి తెలిసి ముందు ఆశ్చర్య పోయాను. అయిన కన్నడలో డైరెక్ట్ చేసిన ‘రంగితరంగ’ సంవత్సరం పాటు ప్రదర్శితమై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అన్ని ఎమోషన్స్‌తో అనూప్ దర్శకత్వంలో ‘రాజరథం’ రూపొందింది. అద్భుతమైన స్క్రీన్‌ప్లే కుదిరింది. ఈ సినిమా ద్వారా నిరూప్ భండారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇది పెద్ద సూపర్‌హిట్‌గా నిలిచి నిరూప్, అనూప్‌లకు మంచి వెల్‌కమ్ మూవీ అవుతుంది” అన్నారు.
పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ – ”డైరెక్టర్ అనూప్ మంచి టాలెంటెడ్ పర్సన్. తనలో ఎంత విజన్ ఉందో..అంతే హ్యుమర్ కూడా ఉంది. నాతో మంచి పాటలను రాయించుకున్నారు. ఆల్బమ్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు” అన్నారు.
హీరోయిన్ అవంతిక శెట్టి మాట్లాడుతూ – ”రాజరథం’ నా తొలి తెలుగు సినిమా. అనూప్‌గారి దర్శకత్వంలో నిరూప్ వంటి కోస్టార్‌తో కలిసి పనిచేయడం..నాకొక మంచి ఎక్స్‌పీరియెన్స్” అన్నారు.
హీరో నిరూప్ భండారి మాట్లాడుతూ – ”రాజరథం’ సినిమా చేయడానికి ముందు నాకు తెలుగు వచ్చేది కాదు. డబ్బింగ్ చెప్పే సమయానికి తెలుగు నేర్చుకున్నాను. సినిమా బాగా వచ్చింది. రానాగారు మా యూనిట్‌ను అభినందించడానికి వచ్చినందుకు ఆయనకు థాంక్స్. మా ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా కోసం కష్టపడ్డాం. డైరెక్షన్, మ్యూజిక్ ను అన్నయ్య చేస్తే, కాస్ట్యూమ్స్‌ను వదిన డిజైన్ చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను. తెలుగు ప్రేక్షులు నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
చిత్ర దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ – ”రంగితరంగ’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘రాజ రథం’. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు మ్యూజిక్ కూడా నేనే చేశాను. నా మ్యూజిక్‌లో వస్తున్న ఆల్బమ్ మా నాన్న సుధాకర్ భండారిగారు తెలుగులో చాలా సినిమాలకు పని చేశారు. నా ఫేవరేట్ మూవీ గీతాంజలితో పాటు..చిరంజీవిగారి సినిమాలకు పనిచేశారు. అలాగే నా శ్రీమతి ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేసింది. హీరో హీరోయిన్స్ బాగా నటించారు. నన్ను నమ్మి ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన సతీష్ శాస్త్రి మాట్లాడుతూ – ”అనూప్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘రంగితరంగ’ చిత్రాన్ని ఓవర్‌సీస్‌లో మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఓవర్‌సీస్‌లో ఆ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ థియేటర్‌లో 50 రోజులు ప్రదర్శితమైంది. ఓవర్‌సీస్‌లో అంత మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకున్న సినిమా అదే. తర్వాత అనూప్‌ను కలిసి..తనతో రాజరథం సినిమాకు అసోసియేట్ అయ్యాం. హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. అలాగే ఈ సినిమాకు మోరల్ సపోర్ట్ అందిస్తున్న హీరో రానా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.
దగ్గుబాటి రానా మాట్లాడుతూ – ”నేను ఒక సినిమా అవార్డ్ ఫంక్షన్‌ను హోస్ట్ చేస్తున్నప్పుడు ‘రంగితరంగ’ సినిమా ఎక్కువ అవార్డులను గెలుచుకుంది. అప్పటి వరకు అనూప్ భండారి నాకు పరిచయం లేదు. ఆ తర్వాతే అనూప్‌ను కలిసి తనతో పరిచయం పెంచుకున్నాను. ఈ సినిమాలో నేను కనిపించను..వినిపిస్తాను. నా దృష్టిలో హద్దులను చేరిపేసే కథలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో ‘రాజరథం’ ఒకటి. అటువంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా అలాంటి సినిమాలనే చూడటానికి ఇష్టపడతాను. అలాగే అటువంటి కథలతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపుతాను. అలాంటి విలక్షణమైన కథతో రూపొందిన ‘రాజరథం’ తెలుగులో పెద్ద సక్సెస్ సాదిస్తుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు” అన్నారు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘రాజరథం’ చిత్రంలో నిరూప్ భండారి, అవంతిక శెట్టి, పి.రవిశంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అజనీష్ లోక్‌నాథ్, ఎడిటింగ్: శాంతకుమార్, సినిమాటోగ్రఫీ: విలియమ్ డేవిడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధాకర్ సాజ, నిర్మాణం: జాలీహిట్స్ టీమ్, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం: అనూప్ భండారి.