బొద్దుగుమ్మ ‘భాగమతి’కి బిజినెస్ క్రేజ్ !

‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాల్లో నటించడం ద్వారా అనుష్కకు బాలీవుడ్‌లోనూమంచి గుర్తింపు వచ్చింది. ‘బాహుబలి-2’లో ఈ బెంగలూరు ముద్దుగుమ్మ కత్తి యుద్ధాలు కూడా చేయడంతో చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఈ కారణంగానే అనుష్కను ప్రభాస్‌కు జోడిగా ‘సాహో’ సినిమాలోనూ కంటిన్యూ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ సంగతి ఎలా ఉన్నా ‘బాహుబలి’ కారణంగా అనుష్కకు వచ్చిన ఇమేజ్, ఆమె నటిస్తున్న ‘భాగమతి’ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా ప్లస్ అయినట్టు కనిపిస్తోంది.ఒక్కే ఒక్క క్రేజీ ప్రాజెక్టుతో బాలీవుడ్‌లో పాపులర్ అయిన ముద్దుగుమ్మ కొత్త సినిమాకు ఊహించని డిమాండ్ ఉందట. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ టాలీవుడ్‌కు షాకిచ్చే రేటుకు అమ్ముడైపోయాయట.

 అనుష్క ‘సైజ్ జీరో’ కోసం బొద్దు గుమ్మగా మారిన విషయం తెలిసిందే .దానితో పాటు మరికొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతున్న ‘భాగమతి’ సినిమా షూటింగ్, మళ్లీ పట్టాలెక్కిందని తెలుస్తోంది . ఈ సినిమాను  యూవీక్రియేషన్స్ రూపొందిస్తోంది. ఇదిలా ఉంటే అనుష్క కారణంగా ఈ సినిమాకు అనూహ్యంగా బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఇప్పటికే ఈ సినిమా 40 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా హిందీ డబ్బింగ్ రైట్స్‌కు కూడా మంచి రేటు వచ్చిందని వార్తలు జోరందుకున్నాయి. అనుష్క నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ఓ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా పన్నెండున్నర కోట్లు పెట్టి దక్కించుకున్నాడట.అనుష్కకు ‘బాహుబలి 2’ ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగాఆ  డిస్ట్రిబ్యూటర్ ఇంత రేటు పెట్టి ‘భాగమతి’ డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్నాడని సినీజనం చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ… టీజర్ కానీ విడుదల కాకుండానే ఈ సినిమాకు ఈ రేంజ్ డిమాండ్ రావడం,  బిజినెస్ జరగడం గొప్ప విషయమే.