చివరికి మైక్రోఫోన్‌తో కూడా రొమాన్స్‌ చేయగలడు !

“షారుక్‌ తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయడం సులభం” అని బాలీవుడ్‌ నటి అనుష్కా శర్మ చెబుతోంది. “అతని కళ్లలో నిజాయితీ కనబడుతుందని.. అది మనం స్క్రీన్‌పై చూడవచ్చని, షారుక్‌ చివరికి మైక్రోఫోన్‌తో కూడా రొమాన్స్‌ చేయగలడ”ని చెప్పుకొచ్చింది అనుష్కా. దీనికి షారుక్‌… “నువ్వు మైక్‌ పట్టుకున్నంత కాలం రొమాన్స్‌ చేయగలను డార్లింగ్‌” అని రిప్లే ఇచ్చాడు.

‘రబ్‌ నే బనా దీ జోడీ'(2008), ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ (2012) చిత్రాల్లో  నటించిన షారుక్‌, అనుష్కా జంట అప్‌కమింగ్‌ చిత్రం ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’  తో ఆగష్టు 4 న ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే. చిత్రంలోని  హావాయిన్‌ సాంగ్‌ను షారుక్‌, అనుష్కలు విడుదల చేశారు. ఈ పాటలో హ్యారీ అండ్‌ సెజల్‌ మధ్య మంచి రొమాన్స్‌ ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు .  షారుక్‌ తన ఇన్‌ స్ట్రాగ్రమ్‌లో పోస్టు చేయగా,  అనుష్కా మ్యూజిక్‌ కంపోజర్‌ ప్రీతమ్‌తో రిలీజ్‌ చేసింది. “తనను కేవలం ప్రేమకథా చిత్రాలకే అభిమాని అని అందరూ భావిస్తున్నారు. కానీ ప్రేమతో పాటు కామెడీ సినిమాలను కూడా ఇష్టపడుతా”నని షారుక్‌ చెప్పుకొచ్చాడు.

గ్రామీ అవార్డు విన్నర్‌తో…

 తన సినిమాల్లోని కొన్ని పాటలకు హాలీవుడ్‌ సింగర్స్‌, మ్యూజిక్‌ కంపోజర్స్‌తో షారూఖ్‌ ఖాన్‌ పనిచేయడం కొత్తేమీ కాదు. గతంలో ‘రావణ్‌’ చిత్రంలో ‘ఛమ్మక్‌ ఛల్లో..’, ‘క్రిమినల్‌’ పాటలను ‘ఆర్‌అండ్‌ బి’ సింగర్‌ అకాన్‌ పాడగా, తాజాగా గ్రామీ అవార్డు విన్నర్‌, అమెరికన్‌ డిజే, రికార్డ్‌ ప్రొడ్యూసర్‌ డిప్లోతో తాజా చిత్రానికి పనిచేస్తున్నారు. షారూఖ్‌  ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ చిత్రంలో  ‘ఫుర్‌ర్‌ర్‌..’ అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌ను ఈ అమెరికన్‌ రాపర్‌ డిప్లో కంపోజ్‌ చేశారు. ఈ పాటను మోహిత్‌ చౌహన్‌, తుషార్‌ జోషి ఆలపించారు. ఈ సాంగ్‌ షూటింగ్‌ టైమ్‌లో డిప్లోతో దిగిన ఫొటోలను షారూఖ్‌ ఖాన్‌ ట్వీట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పాటలో డిప్లో కూడా కనిపిస్తారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.