విరామం తీసుకున్న ఈ మధ్య కాలంలో ఏం చేసింది?

అనుష్క శెట్టి… బాగా గ్యాప్ తీసుకున్న ఈ మధ్య కాలంలో ఏం చేసింది? అదుపు తప్పిన అందాల మీద దృష్టి పెట్టిందట.అనుష్క  మనకు అందాల హీరోయిన్‌గానే తెలుసు. కానీ, ఆమె ఒకప్పుడు యోగా ట్రైనర్. సినిమాల్లోకి వచ్చాక ఈ యోగిని ఓ రేంజ్లో సక్సెస్ అయింది. అందుకు కారణం ఆమె టాలెంట్ మాత్రమే కాదు. ఆమె రూపం కూడా. అనుష్క ఫిట్ అండ్ పర్ఫెక్ట్ బాడీ కెరీర్ మొదట్నుంచీ ఆమెకు అతి పెద్ద ఎసెట్. కాకపోతే, ఆ మధ్య వచ్చిన ‘సైజ్ జీరో’ మూవీ … అనుష్క సీన్ మొత్తం రివర్స్ చేసేసింది. అప్పటి‌దాకా సెక్సీ అనిపించుకున్న స్వీటీ భారీగా బరువు పెరిగి ఆంటీలా తయారైపోయింది.
 సినిమాల కోసం హీరోయిన్స్ బరువు తగ్గుతుంటారు. కానీ, అనూ రొటీన్‌కి భిన్నంగా బరువు పెంచేసింది. ‘సైజ్ జీరో’ పేరున్న సినిమా కోసం మన దేవసేన భారీ సైజులోకి మారిపోయింది. తరువాత ఎలాగో ‘బాహుబలి 2’ కానిచ్చేసింది. ఆ తరువాత ‘భాగమతి’ సినిమా కూడా చేసింది. బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి2’  హిస్టారికల్ హిట్టయింది. అయినా, అనుష్క మాత్రం కలవరపాటుకే లోనైంది. అందుకు కారణం భారీ విగ్రహంతో ఆమె తెర మీద కనిపిస్తే హీరోల పక్కన ఏమంత బావుండదనే టాక్ బయలుదేరింది.
‘మిర్చీ’ లో కనిపించిన ఘాటైన అనుష్క… ఇప్పుడేదీ? అంటూ పెదవి విరుపులు మొదలయ్యాయి. ప్రమాదం గ్రహించిన జేజమ్మ సినిమాలకు కొన్నాళ్లు విరామం ప్రకటించింది.అనుష్క బాగా గ్యాప్ తీసుకున్న ఈ మధ్య కాలంలో ఏం చేసింది? అదుపు తప్పిన అందాల మీద దృష్టి పెట్టిందట. కసిగా కసరత్తులు చేసి మళ్లీ పాత సూపర్ బ్యూటీని బయటకు తెచ్చిందట. థర్టీ ప్లస్ వయస్సులోనూ నాటీగా కనిపిస్తోందట. అయితే, తన సరికొత్త రూపంలో స్వీటీ త్వరలోనే కెమెరా ముందుకు రానుందంట. రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిలో దేవసేన హాజరుకానుందట. ఇక మన క్యూట్ అనుష్క వరుసగా  మూవీస్ చేస్తుందని టాక్. ప్రస్తుతానికైతే ఆమె మాధవన్ హీరోగా కోన వెంకట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలాగే, ప్రభాస్ రాధాకృష్ణ మూవీలోనూ  ఓ స్పెషల్ రోల్‌లో తళుక్కుమంటుందని సమాచారం. చూడాలి మరి…