మణిరత్నం కన్నా…’పారితోషికమే’ మిన్న!

“సైలెన్స్‌” అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న అనుష్క షెట్టి …” చారిత్రక కథా చిత్రాలు ఇక చాలు బాబూ ” అంటోందట. ‘అరుంధతి’ ,’రుద్రమదేవి’, ‘బాహుబలి’ నటిగా అనుష్క ను అగ్రస్థాయిలో కూర్చోబెట్టాయి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల నాయకిగా నిలిపాయి. అలాంటిది ‘చారిత్రక కథా చిత్రాలు ఇక వద్దు’ అని చెబుతోంది  .ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘సైలెన్స్‌’ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘నిశ్శబ్దం’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటిస్తోంది.మాధవన్‌ ప్రధాన పాత్రలో .. అంజలి ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
 
అనుష్క ఒక ఇంటర్వ్యూలో.. “ఇకపై చరిత్ర కథా చిత్రాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు” చెప్పింది. ఆ చిత్రాలను పూర్తి చేయడానికి ఎక్కువ రోజులు పడుతోందని… మేకప్‌కు అధిక సమయం పడుతోందని అంటోంది. వీటిలో చెయ్యడం వల్ల ఆరోగ్యపరంగా అలసటకు గురవుతున్నట్లు తెలిపింది. అందుకనే ఆ చిత్రాల్లో నటించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. మణిరత్నం తెరకెక్కించనున్న భారీ చారిత్రాత్మక చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో అనుష్క నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమె చెప్పిన పై కారణాల వల్లే ఆ చిత్రంలో నటించడానికి నిరాకరించినట్లు తాజా వార్త .
 
మణిరత్నం వైవిధ్యంగా సినిమాలు చెయ్యడం లో సిద్ధహస్తుడని మరోసారి చెప్పక్కరలేదు. ఈ మధ్య కాస్త వెనుక బడ్డ మణిరత్నం ‘చెక్క చివంత వానం’ (నవాబ్) చిత్రంతో మళ్లీ దారిలో పడ్డారు.ఆ మల్టీస్టారర్‌ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో.. ఒకసారి వాయిదా పడ్డ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఇది కల్కీ అనే రచయిత రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా చేస్తున్న చిత్రం. ఇందులో విక్రమ్, కార్తీ, జయంరవి, అమితాబ్‌బచ్చన్, మోహన్‌బాబు, ఐశ్వర్యరాయ్,నయనతార, కీర్తీసురేష్ నటించనున్నారు. అనుష్క కూడా ఓముఖ్యపాత్రలో నటిస్తారని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమె నటించడం లేదని వార్త వచ్చింది. అందుకు కారణం… నయనతార కంటే అనుష్క పాత్ర తక్కువ కావడమేనని చెప్పుకున్నారు. ఇటీవల అనుష్క ఒక ఇంటర్వ్యూలో.. “ఇకపై చరిత్ర కథా చిత్రాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు” చెప్పింది.
షాక్‌ కొట్టినంత పనైందట !
అనుష్క మణిరత్నం చిత్రంలో నటించడం లేదన్నది నిజమే! అయితే, అందుకు కారణం.. నయనతార కాదట. అలాగే అనుష్క ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు ‘ఇకపై చరిత్ర కథా చిత్రాల్లో నటించకూడద’నే నిర్ణయమూ కారణం కాదట. అసలు కారణం ..’పారితోషికమే’నన్న విషయం ఇప్పుడు వెలుగులోకొచ్చింది . నయనతారకు దీటుగా దక్షిణాదిలో పేరు తెచ్చుకున్న అనుష్క…’పొన్నియన్‌ సెల్వన్‌’ లో నటించడానికి నాలుగు కోట్లు డిమాండ్‌ చేసిందని అంటున్నారు. దీంతో దర్శకుడు మణిరత్నంకు షాక్‌ కొట్టినంత పనైందట. వారు రూ.కోటి ప్లస్‌ జీఎస్‌టీ కలిపి ఇస్తామని చెప్పడంతో.. ఈ సారి అనుష్కకు షాక్‌ కొట్టినంత పనైందట. పారితోషికం విషయంలో అనుష్క పట్టు సడలించకపోవడంతో మణిరత్నం ఆమె పాత్రలో మరో నటిని ఎంపిక చేసే పనిలో పడ్డారట. ఆ పాత్రకు త్రిష సెట్‌ అయ్యిందని సమాచారం. ఐశ్వర్యారాయ్‌ ద్విపాత్రాభినయం చేయడంతో ఇక అనుష్క పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఏముంటుంది? ..అయినా రూ.4 కోట్లు తీసుకునే అనుష్కను రూ.కోటి పారితోషికం అంటే ఎలా ఒప్పుకుంటుంది? కాగా లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్‌.రెహ్మాన్‌ అందిస్తున్నారు. డిసెంబర్‌లో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. త్వరలో దర్శకుడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో అనుష్క నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.