గౌతమ్‌తో విసిగి పోయి.. చందూతో కమిటయ్యింది !

అనుష్క… ‘భాగమతి’  తరువాత తెలుగు, తమిళ భాషల్లో గౌతమ్‌మీనన్ తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రంలో నటించనుందని వార్తలు వినిపించాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆమె మైత్రీ మూవీమేకర్స్ సంస్థలో సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకుందని తాజా సమాచారం. ‘అరుంధతి’, ‘భాగమతి’ చిత్రాల తరహాలో మహిళా ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందనుందని, విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. కాగా కొత్త పంథాలో సాగే ఈ చిత్రంలో కథను మలుపుతిప్పే కీలక అతిథి పాత్రలో హీరో నాని కనిపించనున్నారని చిత్ర వర్గాల సమాచారం.
సమయాన్ని వృథా చేసుకోకూడదని …
తెలుగు, తమిళ భాషల్లో గౌతమ్‌మీనన్ తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రంలో అనుష్క నటించనుందని వార్తలు వచ్చాయి.ఎంతకీ ఆ సినిమా మొదలవకపోవడం తో   గౌతమ్‌మీనన్‌ పై అనుష్క నమ్మకం సన్నగిల్లిందట.   దీంతో ఆయన చిత్రం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అనుష్క ఓపిక నశించడంతో…  గౌతమ్‌ చిత్రం కోసం ఇంకా వేచి చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చిందట. దాంతో… దర్శక నిర్మాతలను పిలిచి ‘కథలు రెడీ చేసుకుని త్వరలో ఆ చిత్రాల వివరాలను ప్రకటించండి’ అని చెప్పారట.
అనుష్క ‘భాగమతి’ చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలం అయినా మరో చిత్రానికి కమిట్‌ కాలేదు.దీంతో ఆమె గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని, కారణం పెళ్లికి సిద్ధం అవడమేననే ప్రచారాలు జోరుగానే సాగుతున్నాయి. అయితే, అనుష్కకు చాలా అవకాశాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని కథలను వింటోంది. ఎన్ని అవకాశాలు వస్తున్నా, ఒక్క గౌతమ్‌మీనన్‌ చిత్రం మినహా ఏ చిత్రాన్ని అంగీకరించలేదని చెప్పింది.ఆమె ఆ విషయం చెప్పి చాలా కాలమైంది. గౌతమ్‌మీనన్‌ కూడా ఒక మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్నట్లు, అందులో నటి అనుష్క నటించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుటి వరకూ ప్రారంభం కాలేదు. గౌతమ్‌మీనన్‌ ధనుష్‌ హీరోగా ‘ఎన్నైనోకి పాయు తూట్టా’, విక్రమ్‌ హీరోగా ‘ధ్రువనక్షత్రం’ చిత్రాలను పూర్తి చేసే పనిలోనే ఉన్నారు. తదుపరి శింబు హీరోగా ‘విన్నైతాండి వరువాయా–2’ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు.