2014,15,16 సంవ‌త్స‌రాల‌కు జాతీయ సినిమా పుర‌స్కారాలు !

ఏపీ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు నంది అవార్డుల‌ను ప్రకటించింది. 2014లో మొత్తం 38 సినిమాలు ఎంట్రీకి రాగా, 2015లో 29, 2016లో 45 సినిమాలు నంది అవార్డుల కోసం ఎంపిక అయ్యాయి. నంది అవార్డులే కాకుండా ఎన్టీఆర్ జాతీయ సినిమా పుర‌స్కారం, బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా పుర‌స్కారం, ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం అందుకున్న వారి పేర్లను కూడా జ్యూరీ స‌భ్యులు ప్ర‌క‌టించారు. ఈ అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.
2014 జాతీయ సినిమా అవార్డులు:
ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- క‌మ‌ల్‌హాసన్
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- సీనియ‌ర్ న‌టుడు కృష్ణం రాజు
స్పెషల్ జ్యూరీ అవార్డు- గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌
2015 జాతీయ సినిమా అవార్డులు:
ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- ఎమ్.ఎమ్. కీర‌వాణి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్‌
స్పెషల్ జ్యూరీ అవార్డు – పీసీ రెడ్డి
2016 జాతీయ సినిమా అవార్డులు:
ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ర‌జినీకాంత్‌
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- బోయ‌పాటి శ్రీను
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- కేఎస్ రామారావు
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- చిరంజీవి
స్పెషల్ జ్యూరీ అవార్డు – ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌