అతనంటేనే నాకు నిజంగా ఇష్టం !

‘మీ అభిమాన హీరో ఎవరు ?’ అని అడిగితే మన హీరోయిన్ లు  ఎంతో తెలివిగా …. మహేష్ బాబు, పవన్  కళ్యాణ్, ఎన్టీఆర్ ల పేర్లు చెబుతుంటారు . అయితే ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలిని పాండే కు అన్ని తెలివి తేటల్లేవు . ఈ విషయమై ‘పేస్‌బుక్ ‘ద్వారా లైవ్‌లో మాట్లాడిన షాలిని ఓ అభిమాని ఆమెను ‘మీకు ఏ హీరో అంటే ఇష్టం ?’ అనే ప్రశ్న వేయడంతో… “తనకు ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ అంటేనే నిజంగా ఇష్టం” అని చెప్పడం విశేషం.అలాగే తాను ‘మహానటి’ సినిమాలో నటించడమనే వార్త నిజమేనని చెప్పింది. అంతేకాకుండా తాను ‘100 % లవ్’ తమిళ్ రీమేక్‌లో నటించేందుకు ఒప్పుకున్నానని కూడా చెప్పింది’.

హీరోకు సమానంగా ఉండే పాత్రతో…..

‘అర్జున్‌రెడ్డి’ సినిమా సాధించిన ఘన విజయంతో హీరో విజయ్‌ దేవరకొండతో పాటు హీరోయిన్‌ షాలినీ పాండేకూ మంచి మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. జబల్‌పూర్‌ రంగస్థల నటి అయిన షాలిని మెడికోగా ‘అర్జున్‌రెడ్డి’లో ప్రదర్శించిన హావభావాలు అందరినీ కట్టి పడేశాయి. తాజాగా ఆమెకు తమిళంలో మంచి ఆఫర్‌ లభించింది. నాగచైతన్య, తమన్నా జంటగా నటించగా హిట్టయిన ‘100% లవ్‌’ తమిళంలో ‘100% కాదల్‌’ పేరుతో రీమేక్‌ అవుతోంది. జి.వి. ప్రకాశ్‌కుమార్‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నాయిక పాత్రకు షాలిని ఎంపికైంది. ఇప్పటికే ఆమె సంతకం చేసింది కూడా. ‘100% లవ్‌’లో తమన్నాకు ఎంత పేరొచ్చిందో తెలిసిందే. హీరోకు సరి సమానంగా ఉండే ఆ పాత్రతో షాలిని కూడా తమిళ ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెప్పొచ్చు. కాగా బుధవారం ఓ మొబైల్‌ దుకాణాన్ని ప్రారంభించడానికని నెల్లూరు వెళ్లి అస్వస్థతకు గురైన షాలిని కోలుకుంది.